పరిటాల శ్రీరామ్ టార్గెట్: దేవినేని, రాత్రి సోదాలా: రావుల

ఓ మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో భర్తను కోల్పోయిన తోటి శాసనసభ్యురాలిని ఇలా అగౌరవపర్చడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, డిజిపి దినేష్ రెడ్డి దృష్టికి తాము తీసుకు వెళ్తామని చెప్పారు. పరిటాల సునీత ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఏం సాధించారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చాక తమ పార్టీ కార్యకర్తలను ఏదో ఒక విధంగా టార్గెట్ చేసుకుంటోందన్నారు. తమ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తున్నారన్నారు. సెర్చ్ వారెంట్, స్పీకర్ అనుమతులు లేకుండా పోలీసులు అర్ధరాత్రి సోదాలు ఎలా నిర్వహించారో చెప్పాలన్నారు.
వైయస్ ఫ్యాక్షన్ పాలన కిరణ్ కొనసాగింపు
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్ పాలనను ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారని విజయవాడలో దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. వైయస్ ఉన్నప్పుడు పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నారని, ఇప్పుడు ఆయన తనయుడు శ్రీరామ్‌ను టార్గెట్ చేశారన్నారు. భూకబ్జాలపై హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తనయుడు పైన ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శ్రీరామ్ పైన పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications