గాలి కేసు: అలీఖాన్‌పై సిబిఐ చార్జిషీట్ దాఖలు

సిబిఐ 75 పేజీల చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది. ఇందులో 70 డాక్యుమెంట్లను జత చేసింది. 25 మంది సాక్షుల పేర్లను జత చేసింది. అంతకు ముందు సిబిఐ జనార్దన్ రెడ్డిపై, ఆయన బావ బివి శ్రీనివాస రెడ్డిపై, మరో ముగ్గురిపై, ఒఎంసిపై 2011 డిసెంబర్‌లో అభియోగాలు మోపుతూ మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది.
ఆ తర్వాత ఈ కేసులో సస్పెన్షన్‌కు గురైన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి పేరును నిందితురాలిగా చేర్చి నిరుడు మార్చిలో చార్జిషీట్ దాఖలు చేసింది. అలిఖాన్ నేరానికి సహకరించడమే కాకుండా ప్రధాన నిందితుడు రెడ్డి పనుల్లో భాగస్వామిగా ఇంతకు ముందు పేర్కొంది.
అలీఖాన్ గాలి జనార్దన్ రెడ్డితో పాటు అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఎఎంసి) కేసులో కూడా నిందితుడు. అలీఖాన్‌ను ఒఎంసి కేసులో బెంగళూర్ నుంచి హైదరాబాదుకు నిరుడు సెప్టెంబర్ 25వ తేదీన తరలించారు. నిరుడు మార్చి 2వ తేదీన అలీఖాన్ బెంగళూర్ కోర్టులో లొంగిపోయాడు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డి, శామ్యూల్, మన్మోహన్ నాంపల్లి కోర్టుకు బుధవారం హాజరయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరు కాలేకపోతున్నట్లు తెలుపుతూ తనకు మినహాయింపు ఇవ్వాలని మంత్రి ధర్మాన ప్రసాద రావు కోర్టును కోరారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications