వివాదం: అమ్మాయిల డ్యాన్స్, డబ్బు వెదజల్లిన నేత

డ్యాన్సులు చేసిన అమ్మాయిలు కూడా కురుచ దుస్తులతో ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వేడుకను అర్ధాంతరంగా ఆపేశారు. ఈ కార్యక్రమంలో 24 పరగణాల జిల్లా పరిషత్ సభ్యుడు అమ్మాయిలు డ్యాన్సు చేస్తున్న స్టేజి పైకి ఎక్కి వారితో కలిపి డ్యాన్సు చేసి డబ్బులు వెదజల్లాడు. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధిష్టానం, నేతలు సీరియస్‌గా ఉన్నారు. వివాదాస్పదం కావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెసు పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిన్న వేడుకలు నిర్వహించామని పార్టీకి చెందిన ఎంపి డీరెక్ ఓబ్రేన్ చెప్పారు. అయితే కురుచ దుస్తులతో అమ్మాయిలతో డ్యాన్సులు చేయించడం, డబ్బులు వెదజల్లడం వంటి వాటిని పార్టీలోని వారు ఎవరూ ఆమోదించరన్నారు. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులపై తప్పకుండా తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దీనిని టీవిలలో చూసిన పలు సంఘాలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు ఖండించాయి. ఇలాంటి వల్గర్ రాజకీయాలు సరికావని సూచించారు. వేడుకను ఇలా నిర్వహించుకోవడం సిగ్గు చేటు అని, ఇలాంటి మైండ్ సెట్ నుండి రాజకీయ పార్టీలు బయటపడాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మమతా శర్మ అన్నారు. ఇలాంటి రాజకీయాల వల్ల భవిష్యత్తు తరాలకు నష్టమని ప్రముఖ విద్యావేత్త సునంద సన్యాల్ అన్నారు.












Click it and Unblock the Notifications