వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ విచారిస్తే అన్ని బయటపెడతా: కిరణ్‌తో కోమటిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat Reddy
హైదరాబాద్: మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)చే విచారణ జరిపించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే విచారణ జరిపించాలని లేఖ ద్వారా కోరారు.

అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై, తనపై ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై సిబిఐచే విచారణ జరిపించాలని తాను ముఖ్యమంత్రిని కోరానని చెప్పారు. ఉత్తమ్ ఆరోపించినట్లుగా తనకు ఎలాంటి కాంట్రాక్టులు, ప్రాజెక్టులు లేవని ఆయన స్పష్టం చేశారు. సిబిఐ విచారణలో తన దగ్గరున్న ఆధారాలను పూర్తిగా బయట పెడతానని కోమటిరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.

సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించని పక్షంలో తాను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలో తన ఉనికి కాపాడుకునేందుకే తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను తెలంగాణ కోసమే తన మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి జిల్లా ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు.

కాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య ఇటీవల వేడి రాజుకున్న విషయం తెలిసిందే. తాను వదిలేసిన మంత్రి పదవిని ఉత్తమ్ కుమార్ స్వీకరించారని, అది తన భిక్షేనని కోమటిరెడ్డి విమర్షించగా.. కోమటిరెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయలేదని, పోతిరెడ్డిపాడు కాంట్రాక్టులు దక్కించుకున్న వారు తెలంగాణవాదులు అవుతారా అని ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు.

English summary
former Minister Komatireddy Venkat Reddy has met CM Kiran Kumar Reddy on Thursday and appealed to probe irrigation project with CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X