వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ కోసం నన్ను అడ్డుకుంటారా: మోపిదేవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkataramana
హైదరాబాద్: తనను కలిసి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వద్ద వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన మోపిదేవి వెంకటరమణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు బుధవారం వార్తలు వచ్చాయి. తన కూతురు పదో తరగతి చదువుతోందని, ప్రతి సబ్జెక్టుల్లోనూ 95 శాతం మార్కులు వచ్చేవి.. 45 శాతానికి పడిపోయాయని, చదువుపై మనసు లగ్నం చేయలేకపోతోందని ఆయన తన గోడును వెల్లబోసుకున్నట్లు ఓ పత్రిక రాసింది. తాను స్కూలుకు వెళ్లలేనని ఏడుస్తోందని, ఇంజనీరింగ్ చదువుతున్న కుమారుడి పరిస్థితి కూడా ఏమంత బాగా లేదని ఆయన అన్నట్లు సమాచారం.

శబరిమల వెళ్లిరావడానికి మధ్యంతర బెయిల్ పొందిన మోపిదేవి గురువారం కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ బుధవారం ఉదయం మోపిదేవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మోపిదేవి తన పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోందని ఆ పత్రిక రాసింది.

వైయస్ రాజశేఖరరెడ్డి చెప్పినట్లే నడుచుకున్నానని, వైయస్ మాట మేరకే ఫైళ్లపై సంతకాలు చేశానని, తన తప్పేమీ లేదని, ఎందులోనూ తన ప్రమేయం లేదని, అయినా అరెస్ట్ చేశారని అన్నట్లు సమాచారం. అప్పటికీ సీబీఐ వ్యవహారంపై చాలాసార్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలిశానని, అరెస్ట్ చేస్తారేమోనన్న అనుమానం వ్యక్తం చేశానని, కిరణ్ కుమార్ రెడ్డి కూడా సరిగా పట్టించుకోలేదని, ఏమీ కాదని సర్దిచెప్పారని, ఇప్పుడు తాను బలిపశువునయ్యానని మోపిదేవి అన్నట్లు తెలుస్తోంది.

అరెస్ట్ జరిగి 8 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం రాలేదని, తన కుటుంబ సభ్యులు తీవ్రంగా కలత చెందుతున్నారని తన ఆవేదనను వెల్లబోసుకున్నట్లు తెలుస్తోందంటూ ఓ తెలుగు దినపత్రిక వ్యాఖ్యానించింది. తాను బయటకు వస్తే జగన్ కూడా బెయిల్‌పై బయటకు వస్తారంటున్నారని, అందుకే తనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

తనకు, జగన్‌కు ఏం సంబంధమని ఆయన అడిగినట్లు తెలుస్తోంది. తనకు బెయిల్ ఇస్తే.. జగన్‌కు ఎందుకు ఇస్తారని మోపిదేవి వ్యాఖ్యానించారు. మంత్రి ధర్మాన విషయంలో ముందుజాగ్రత్తలు తీసుకున్నట్లే.. తన విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించి ఉంటే బాగుండేదని మోపిదేవి అన్నట్లు సమాచారం.

English summary
Former minister Mopidevi Venkataramana, arrested in YSR Congress president YS Jagan, has expressed his agony before Botsa Satyanarayana and Anam Ramanarayana Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X