తెలంగాణపై సంకేతాలు: భయంవద్దని లగడపాటి హామీ!

Lagadapati Rajagopal
విజయవాడ: తెలంగాణపై కేంద్రం, పార్టీ తీసుకునే నిర్ణయంపై తమకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ విడిపోదన్నారు. తెలుగు గడ్డ ఖచ్చితంగా ఒకటిగానే ఉంటుందని చెప్పారు. ఆ దిశలో ఇప్పటికే తమకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెప్పారు.

త్వరలో జరగనున్న ప్రాంతీయ సదస్సులో తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై చర్చించమన్నారు. ఈ సమావేశం ప్రాంతాల గురించి కాదన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల గురించి అన్నారు. తెలుగు నేలను, గడ్డను, నీటిని ఎవరూ విడదీయలేరన్నారు. విభజనపై ఎవరికీ ఎలాంటి ఆందోళన, భయం వద్దని హామీ ఇచ్చారు. విభజన జరగదని ఇప్పటికే అర్థమయిందని, అర్థం కాని వారు ఎవరైనా ఉంటే తెలుసుకోవాలని సూచించారు.

కాగా అంతకుముందు ఈ నెల 7వ తేదిన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ సమావేశాల ఏర్పాట్లు పరిశీలించేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారు. ఆయన కూడా తెలంగాణ అంశంపై స్పందించారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం నిర్ధిష్టమైన ప్రకటన చేస్తే తాము దానికి తప్పకుండా కట్టుబడి ఉంటామని చెప్పారు.

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోవడానికి, కలిసి ఉండటానికి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఊసర వెల్లి రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ప్రాంతాల వారిగా ప్రజలను టిడిపి మభ్యపెడుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+