ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఐదుగురిపై చార్జిషీట్ దాఖలు

ఆరో నిందితుడిని మైనర్‌గా భావిస్తున్నారు. అతను మైనర్ అయితే విడిగా జువెనైల్ కోర్టులో అతనిపై విచారణ జరుగుతుంది. అతను మైనరా, వయోజనుడా అనే విషయం తెలుసుకోవడానకి ఎముకల పరీక్ష నిర్వహించారు. దాని నివేదిక రావాల్సి ఉంది.
23 వైద్య విద్యార్థిని ప్రాణాలను హరించిన దారుణమైన నేరానికి ఆరుగురు కూడా పాల్పడ్డారని డిఎన్ఎ పరీక్షల్లో తేలినట్లు సమాచారం. నిర్భయ కేసును విచారించడానికి అంతకు ముందు భారత ప్రధాన న్యాయమూర్తి అల్తమస్ కబీర్ సాకేత్ కోర్టు సముదాయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ప్రారంభించారు. ఈ కోర్టులో విచారణ జరిగే మొదటి కేసు గ్యాంగ్ రేప్ కేసులో ప్రాణాలు విడిచిన నిర్భయదే.
ఫిజియోథెరపీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం తీవ్రత దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. అత్యంత హేయంగా ఆమెను ఆరుగురు వ్యక్తులు రేప్ చేశారు. ఆ తర్వాత బస్సులోంచి తోసేశారు. కింద పడిన ఆమె మీదుగా, ఆమె మిత్రుడిగా బస్సును తోలి వారిని హత్య చేయాలని ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications