న్యూఇయర్ పార్టీ కోసం పిల్చి రేప్: ప్రియురాలికి నిప్పు

New year: 17 year old raped by two in Delhi on December 31 night
న్యూఢిల్లీ/బెంగళూరు: బస్సులో గ్యాంగ్ రేప్‌కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన నిర్భయ అంత్యక్రియలు అలా పూర్తయ్యాయో లేదో ఢిల్లీలో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. పదకొండో తరగతి చదువుతున్న పదిహేడేళ్ల అమ్మాయిపై ఇద్దరు యువకులు రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీ సమీపంలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జరిగింది. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బస్సులో గ్యాంగ్ రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఢిల్లీ వీధులు యువతతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో న్యూఇయర్ వేడుకలకు ఆహ్వానించి ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతికి సోషల్ వెబ్ సైట్ల ద్వారా రాజేష్, నవీన్ ఇనే ఇద్దరు యువకులతో పరిచయం ఏర్పడింది. ఓ మార్కెట్లో నూతన సంవత్సర వేడుకలకు రావాల్సిందిగా వారు ఆమెను పిలిచారు.

వేడుకలు ముగిసిన తర్వాత ఇంటి వద్ద దింపుతామని వారు ఆమెను కారులో ఎక్కించుకున్నారు. మత్తు మందు కలిపిన కూల్ డ్రింగ్ ఇచ్చారు. స్పృహ కోల్పోయిన ఆమెను ఓ ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె వారి నుండి బయట పడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నిందితులను రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. రాజేష్ ఓ ఐటి సంస్థలో ఇంజనీర్‌గా, నవీన్ ఓ మానవ వనరుల సంస్థ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు.

ముంబయిలో..

అడిగిన డబ్బులు ఇవ్వలేదని తన ప్రియురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడో ప్రేమోన్మాది. యువతి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. తాను అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో అఫ్తాబ్ ఖాన్ అనే వ్యక్తి ప్రియురాలి పైన కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 95 శాతం కాలిన ఆమె ఆసుపత్రిలో చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+