తెలంగాణ ఒత్తిడి: నేతల భేటీ, డికె అరుణ సొంత అజెండా

దీంతో తెలంగాణ కాంగ్రెసు నేతల్లో ఆందోళన ప్రారంభమైంది. షిండే చెప్పినట్లుగా అలాగే మూడేళ్ల క్రితం 9 డిసెంబర్ 2009లో ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల్లో తెలంగాణకు అనుకూలంగా అధిష్టానం, కేంద్రం నిర్ణయం తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకు వచ్చేందుకు తెలంగాణ కాంగ్రెసు నేతలు శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్సులో భేటీ అవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలువురు నేతలు సమావేశ స్థలికి చేరుకున్నారు.
నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామి షిండే చెప్పినందు వల్ల తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చే విధంగా అధిష్టానంపై ఎలా ఒత్తిడి తీసుకు రావాలనే అంశాన్ని ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. హాజరు కానున్నారు. మంత్రుల్లో ఎందరు హాజరవుతారనే అంశంపై స్పష్టత లేదు. నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లు హాజరు కావడం లేదు.
వారికి ఆహ్వానాలు కూడా అందలేదు. దీంతో హాజరయ్యేందుకు వారు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రి డికె అరుణ కూడా గైర్హాజరవుతున్నారు. ఆమె తన సొంత అజెండాతో ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తున్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో భేటీ జరిగే సమయానికి డికె అరుణ తన వర్గం నేతలతో మరో సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి కూడా భేటీకి దూరంగా ఉండనున్నారు.












Click it and Unblock the Notifications