మండలికి నో: కోదండరామ్, మోకాళ్లపై...: బాబుపై ఈటెల

తెలంగాణకు స్వయంపాలన, ఆత్మగౌరవం కావాలని ఆయన అన్నారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం తమకు కావాలని అన్నారు. ఈ నెల 21వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చకపోతే అగ్నిగుండమే అవుతుందని సిపిఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇంకా జాప్యం చేస్తే కాంగ్రెసు పార్టీకి నూకలు చెల్లినట్లేనని ఆయన శనివారం కరీంనగర్‌లో అన్నారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 19వ తేదీన ఇందిరా పార్కు వద్ద సిపిఐ సామూహిక ధర్నా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు కరెంట్ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 22వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి ఉంటుందని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వేలాది కిలోమీటర్లు మోకాళ్లపై నడిచినా తెలంగాణ ప్రజలు విశ్వసించరని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభా పక్ష నేత ఈటెల రాజేందర్ కరీంనగర్‌లో శనివారం అన్నారు. చంద్రబాబు విలువలు, నీతిలేని రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజల ఆకాంక్ష కోసం ఉద్యమిస్తున్న తమపై పార్టీని చంద్రబాబు విమర్శించడమంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగానే రాష్ట్రంలో అధ్వాన పరిస్థితి నెలకొని ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications