హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అరుణ హత్య: శివకుమార్‌పై పూణేలో మరో కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థిని అరుణ హత్య కేసు మరో మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు శివకుమార్‌పై రైల్వే పోలీసులు ఆత్మహత్యా యత్నం కింద పూణే రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. శివకుమార్ నివాసంలో అరుణ మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం పూణేలో అరెస్టు చేసి హైదరాబాదు తీసుకుని వస్తుండగా నడుస్తున్న రైలులో నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే.

శివకుమార్‌ను రైల్వే పోలీసులు పూణే కోర్టులు హాజరు పరచనున్నారు. అక్కడ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత హైదరాబాదు పోలీసులు శివకుమార్‌ను హైదరాబాదు తీసుకుని రావడానికి పిటి వారంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో శివకుమార్‌ను హైదరాబాదు తీసుకు రావడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. అరుణ హత్య కేసులో ప్రభు, ప్రవీణ్ అనే ఇద్దరిని పోలీసులు హైదరాబాదులో అరెస్టు చేశారు.

అరుణను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అయితే, ప్రేమించిన తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడం వల్లనే నిందితులు ఆమెను చంపినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాదులోని చత్రినాకలో మిత్రుడు శివకుమార్ నివాసంలో 22 ఏళ్ల యువతి అరుణ ఆదివారంనాడు అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతురాలిని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ ఇంగ్లీష్ చదివిన అరుణగా గుర్తించారు.

శివకుమార్ అనే మిత్రుడి నివాసంలో సోమవారంనాడు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. శివ కూడా ఒయు నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాడు. క్రిస్ట్మస్ వేడుకల కోసం శివకుమార్ తల్లిదండ్రులు మెదక్ జిల్లా సిద్దిపేటకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శివకుమార్ తల్లిదండ్రులు సోమవారం ఇంటికి తిరిగి వచ్చారు. వారు వచ్చి చూడడంతో అరుణ మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. పడక గదిలో యువతి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో శివకుమార్ తండ్రి మల్లేష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించాడు.

ఇంటిలో నెట్ హాల్ టికెట్ కనిపించింది. హాల్ టికెట్ ఆధారంగా మృతురాలిని పోలీసులు గుర్తించారు. శివకుమార్‌ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
A case was booked against Sivakumar, accused in Aruna murder case for attempting suicide. Osmania University former student Aruna murder mystery has been busted by Hyderabad police. Main accused Sivakumar was arrested in Pune.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X