జగన్ పార్టీ నీటి బుడగ, బలుపు కాదు వాపే: హరీష్

కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటించిన గడువులోగా తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ మంత్రులను లక్ష్యంగా చేసుకుంటామని హరీష్ రావు అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ తెరాస ఆధ్వర్యంలో నిర్వహించిన మోటారు సైకిల్‌ర్యాలీ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం మెదక్ జిల్లా సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్‌లోని దీక్షా శిబిరం వద్ద ఆయన మాట్లాడారు. గడువులోగా తెలంగాణ ఇవ్వకపోతే పదవులకు రాజీనామా చేస్తామంటూ తెలంగాణ మంత్రులు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాలని కోరారు. తెరాసతో పాటు జేఏసీ, విద్యార్థి సంఘాల కార్యకర్తలంతా ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటారని చెప్పారు.
మంత్రుల సొంత నియోజకవర్గాలలోనే మంత్రుల వైఖరిని ఎండగట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసుది బలుపు కాదని వాపు మాత్రమేనని, ఈ పార్టీ నీటి బుడగలాంటిదని ఆయన అన్నారు. చిన్నకోడూరులో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైయస్సార్ కాంగ్రెసులో చేరే వారంతా తెలంగాణ రాష్ట్రం వద్దన్నట్లేనన్నారు.
వైయస్ విజయలక్ష్మి తెలంగాణలో పర్యటిస్తున్నపుడల్లా ఎంతసేపు కొడుకు గురించి, అధికారం గురించి తప్ప మరోటి మాట్లాడడం లేదని అన్నారు. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications