ఆత్మహత్యాయత్నం: భవనంపై నుంచి, రైలులోంచి దూకి

నడుస్తున్న రైలు నుంచి గురువారం రాత్రి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. కిరణ్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే, తాను ఇష్టపడిన అమ్మాయి తనను ప్రేమించడం లేదంటూ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. నాగోల్‌కు చెందిన గిరిప్రసాద్ (22) గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్ఇ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తాను ప్రేమిస్తున్నానంటూ కొద్ది రోజులుగా అదే కళాశాలకు చెందిన విద్యార్థిని వెంటపడుతున్నాడు.
ఆ విషయాన్ని విద్యార్థిని కళాశాల అధ్యాపకుల దృష్టికి తెచ్చింది. వారు గిరిప్రసాద్‌ను మందలించారు. శుక్రవారం ఉదయం కళాశాలకు వచ్చిన గిరిప్రసాద్ భవనంపైకి ఎక్కాడు. అమ్మాయి తనను ప్రేమించకపోతే దూకేస్తానంటూ బెదిరించాడు. తర్వాత కొద్ది సేపటికే కిందికి దూకేశాడు. చెట్టుపై పడడంతో అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డాడు.
గిరిప్రసాద్‌ను కళాశాల యాజమాన్యం ఆస్పత్రిలో చేర్చింది. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications