అక్బర్‌కు అదే సరైన శిక్ష, భాగ్యనగరం మారింది: రేవంత్

Revanth Reddy
హైదరాబాద్: హిందువుల పైన, హిందూ దేవతల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరువర్గాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించిన మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్టు చేసి, అతనిని ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మహబూబ్ నగర్ జిల్లా శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. అక్బర్‌ను అనర్హుడిగా ప్రకటించడమే సరైన శిక్ష అన్నారు.

కోర్టులు ఆదేశించినా ఇప్పటి వరకు అక్బరుద్దీన్‌ను ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అక్బరుద్దీన్‌ను అరెస్టు చేయక పోవడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు ప్రభుత్వం తన చేతకానితనాన్ని నిరూపించుకుంటుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెసు, మజ్లిస్ పార్టీలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ భాగ్యనగరాన్ని మురికికూపంలా మార్చి వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరం పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడిందన్నారు. అన్ని రంగాలలో నగరం అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చాక నగరం రూపురేఖలే మారిపోయాయని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. టిడిపి తిరిగి 2014 అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు.

కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. బాబు పాదయాత్రకు మద్దతుగా పార్టీ నేతలతో కలిసి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+