జగన్‌ని నిర్దోషిగా చెప్తున్నారు: భూమన, టిఎంపీలపై గోనె

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు తెలంగాణ తీర్మానం చేసి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డికి ఇస్తే ప్రయోజనం లేదన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసు నేతలు పదవీ త్యాగాలకు సిద్ధపడాలన్నారు. కానీ వారు పదవులు వదులుకునేందుకు సిద్ధంగా లేరని విమర్శించారు. అధిష్టానాన్ని పదవులు వదులుకుంటామని హెచ్చరిస్తేనే తెలంగాణ సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
బాబుపై భూమన ధ్వజం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల కోసం కోటి సంతకాల సేకరణ చేపట్టడాన్ని తప్పుపట్టడం సరికాదని తిరుపతి ఎమ్మెల్యే, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చిత్తూరు జిల్లాలో అన్నారు.
జగన్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. దానిని చూడలేని చంద్రబాబు ఇలా విమర్శిస్తున్నారన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు, సిబిఐలు కలిసి జగన్ పైన కుట్ర చేస్తున్నాయని, ఆయనను ప్రజలకు దూరంగా ఉంచాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రజలు స్వచ్ఛంధంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, జగన్‌ను నిర్దోషిగా చెబుతున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications