రెచ్చగొట్టొద్దు: అసద్, కావూరిలపై పొన్నం, బాబుపై గండ్ర

Gandra Venkataramana Reddy - Ponnam Prabhakar
హైదరాబాద్/వరంగల్: తమ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వస్తున్నా మీకోసం పాదయాత్ర సందర్భంగా విమర్శలు చేయడం సరికాదని ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి ఆదివారం వరంగల్ జిల్లాలో అన్నారు. దోపిడీ దొంగల పార్టీ కాంగ్రెసు పార్టీ కాదని తెలుగుదేశం పార్టీయే అన్నారు. టిడిపి తన హయాంలో అభివృద్ధి, సంక్షేమాన్ని మరిచి కేవలం శిలాఫలకాలకే పరిమితమైందన్నారు.

కాంగ్రెసు హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామన్నారు. చంద్రబాబు నాయుడు కోర్టుల నుండి స్టే పొంది జనంలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అధికారం కోసమే వస్తున్నా మీకోసం పేరిట పాదయాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఎప్పుడు ప్రజల సమస్యలు, సంక్షేమం పట్టదన్నారు.

రికార్డుల కోసమే

చంద్రబాబు రికార్డుల కోసమే పాదయాత్ర చేస్తున్నట్లుగా కనిపిస్తోందని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు మూలికే నక్క పైన తాడిపండు పడ్డ చందంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చర్చలతో తెలంగాణ వస్తుందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఓట్లు, సీట్ల కోసమే ఉన్నారని మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకముందన్నారు.

కావూరిపై పొన్నం ధ్వజం

తెలంగాణకు సీమాంధ్ర ప్రజలు సానుకూలంగా ఉన్న సమయంలో ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు వారిని రెచ్చగొట్టవద్దని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివు రావు తనకు మంత్రి పదవి రాలేదనే ఉద్దేశ్యంతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలోని ముస్లింలు అందరూ తెలంగాణ కోరుకుంటున్నారని, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వద్దన్నంత మాత్రాన ఆగదన్నారు. వద్దని చెప్పేందుకు అసద్ ఒక్కడై మైనార్టీ కాదన్నారు. తెలంగాణ కోరుకుంటున్న ఈ ప్రాంత ముస్లింలందరూ మైనార్టీలే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+