వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ అంటే హైదరాబాదును ముస్లింలకు: కావూరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao
ఒంగోలు/హైదరాబాద్: భావోద్వేగం ఆధారంగా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలనే ప్రతిపాదన వెనుక తెలంగాణ నాయకుల స్వార్థం ఉందని ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు శనివారం అన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలోని ఒంగులోలో సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

భావోద్వేగం ఆధారంగా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సి వస్తే హైదరాబాదును రెండువందల ఏళ్లు పరిపాలించిన నవాబులకు అనుగుణంగా ముస్లింలకు హైదరాబాద్ రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 10 మంది రోడ్డెక్కి బస్సులు తగలేస్తే ప్రత్యేక రాష్ట్రం ఇస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి తన ఆస్తులు పెంచుకునేందుకే తెలంగాణ డిమాండ్‌ను ప్రధానంగా లేవనెత్తుతోందని ధఅవజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వం దీని పైన స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాలు కావాలన్న బిజెపి కూడా గెలిచిన అనంతరం అది అవసరం లేదని చెప్పిందని గుర్తు చేశారు. ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా చేయాలని ప్రతిపాదిస్తే వీలుకాదని చెప్పారని, అలాగే ప్రజలు కూడా తిప్పి కొట్టారన్నారు. టిఆర్ఎస్ నాయకుల వంటి స్వార్థపూరితులు రాజకీయాల్లో ఉండకుండా చేయగల శక్తి కేవలం విద్యార్థులకే ఉందన్నారు.

వారి సంగతేంటి

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా, రెండు మతాల మధ్య ఘర్షణలు సృష్టించే వ్యాఖ్యలు చేయడం ఎంత నేరమో.. రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కూడా అంతే నేరమని కాంగ్రెస్ నేత అడుసుమిల్లి జయప్రకాష్ హైదరాబాదులో అభిప్రాయపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగం చేసిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసులు పెట్టడం సరైనదేనని, అలాంటి నేరాలకే పాల్పడిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్, ఆ పార్టీ నేతలు ఈటెల రాజేందర్, కెటిఆర్, హరీష్‌ రావు, తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరాంలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం వెలువరించకుంటే తాము మానవ బాంబులవుతామని ఈటెల రాజేందర్ 2010 జనవరి 29న చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక ఎంపీ అయి ఉండి జాతీయస్ఫూర్తికి విరుద్ధంగా.. తెలంగాణకు అడ్డొస్తే బలిస్తామని, వారిని తెలంగాణలో ఉండనివ్వమని మధుయాష్కీ గత ఏడాది ఆగస్టు 8న హేయంగా మాట్లాడారని గుర్తు చేశారు.

English summary
Congress MP Kavuri Sambasiva Rao has slammed the T agitation and TRS of having launched a movement for sake of power and also collected crores and posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X