కృష్ణలోనూ జంప్‌లు: సంక్రాంతిలోపు ఇద్దరు జగన్ వైపు?

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వెళతారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. తాజాగా కృష్ణా జిల్లాలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్‌కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారట.

వారు సంక్రాంతిలోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు మొత్తం నలుగురు జగన్ వైపు చూస్తుండటంతో జిల్లాలోని ఆ పార్టీలో ఆందోళన కనిపిస్తోంది! ఇటీవల విజయవాడలో కాంగ్రెసు పార్టీ నిర్వహించ తలపెట్టిన ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లలో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పాలుపంచుకోలేదట.

దీంతో వారు జగన్ వైపు వెళ్లేందుకు సిద్దమవుతున్నారని అంటున్నారు. అయితే వారెవరో ఇప్పటి వరకు ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు. అయితే ఇటీవల ఆ జిల్లాకు చెందిన నేతలు పలువరు తమ జిల్లా నుండి ఎవరూ పార్టీ మారరని చెబుతున్నారు. అయినప్పటికీ జంప్ జిలానీలు ఉన్నారని వార్తలు వస్తుండటం గమనార్హం.

కాగా ప్రకాశం జిల్లాలో ఇద్దరు కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అద్దంకి శానససభ్యుడు గొట్టిపాటి రవి కుమార్‌తో పాటు దర్శి శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గొట్టిపాటి రవికుమార్‌తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు, సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరు శానససభ్యులు కూడా ఈ నెలాఖరులోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని అంటున్నారు. ఇదిలావుంటే, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మల్లెల లక్ష్మీనారాయణ శనివారం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో వైయస్ జగన్‌ను కలిశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు కారణంగానే జగన్‌ను జైలులో పెట్టారని మల్లెల లక్ష్మీనారాయణ జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో అన్నారు. ప్రజలు జగన్ వెంట ఉన్నారని, తాను కూడా ఆ పార్టీ కోసం పనిచేస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+