కెబిసిలో రూ.5కోట్లు గెల్చుకున్న 37 ఏళ్ల హౌస్ వైఫ్

ఉత్కంఠ భరిత క్షణాలు కొన్ని గడిచిన తర్వాత ఆప్‌కీ జవాబ్ సహీ హై అంటూ స్వయంగా లేచి వచ్చిన అమితాబ్ 'కౌర్ ' బన్‌గయీ కరోడ్‌పతిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతి ఆరో సీజన్‌లో పంజాబీ మహిళ సన్‌మీత్ కౌర్ సాహెనీ అక్షరాలా ఐదు కోట్ల రూపాయల మెగా బహుమతిని గెలుచుకున్నారు. ఈ బంపర్ ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.
ముందుగా అమితాబ్, తరువాత తన భర్త వచ్చి చెప్పడంతో తనకే జాక్‌పాట్ వచ్చిందని నమ్మానని సాహినీ తెలిపారు. ఈ ఎపిసోడ్ వచ్చే వారం ప్రసారం కానుంది. తనకు బహుమతిగా వచ్చే సొమ్ములో కొంత భాగాన్ని పంజాబీ సంప్రదాయ కార్యక్రమాలకు దానం చేస్తానని, మిగిలిన మొత్తం ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తామని సాహెనీ తెలిపారు.
పంజాబ్‌లోని చండీగఢ్‌లో పుట్టి.. కొన్నేళ్లుగా ముంబయిలో ఇళ్ల వద్ద ప్రైవేట్లు చెబుతున్న సాహినీ హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ధరించే వ్యక్తిని వివాహమాడింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన కెబిసిలో తొలుత కోటి రూపాయలు మాత్రమే బహుమతిగా ఇచ్చేవారు. తర్వాత దాన్ని రెట్టింపు చేసినా, నాలుగో సీజన్ నుంచి మామూలు బహుమతిని కోటి రూపాయలుగానే ఉంచి.. ఐదు కోట్ల రూపాయల జాక్‌పాట్ అదనంగా చేర్చారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications