ఫొటో: సచిన్ టెండూల్కర్ కాళ్లు మొక్కిన ఫ్యాన్
ముంబై: క్రికెట్ అభిమానులు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రతి కదలికనూ ఆసక్తిగా గమనిస్తారు. క్రికెట్ దేవుడిగా కొలిచే అభిమానులు టెండూల్కర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే పట్టపగ్గాలు లేకుండా వ్యవహరిస్తారు. అది దేశవాళీ క్రికెట్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా... టెండూల్కర్ పరుగులు పారించడమే వారికి కావాలి.

ముంబైలో వాంఖడే స్టేడియంలో బరోడాపై మ్యాచులో ఆదివారం టెండూల్కర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఓ అభిమాని నానా తిప్పలు పడి టెండూల్కర్‌ను చేరుకుని, అతని కాళ్లకు దండాలు పెట్టాడు. అభిమానులు తన కాళ్లను తాకితే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని టెండూల్కర్ గతంలో ఓసారి ఓకె మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
తనకు రక్తం రాసిన లేఖలు అభిమానుల నుంచి వస్తుంటాయని, అది సరే... అభిమాని వచ్చి కాళ్లు తాకితే చాలా వింతగా ఉంటుందని, నువ్వు దేవుడివి అంటారని, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, వాళ్లు తన గురించి అలా భావించుకునే మార్గమని అన్నాడు.
అభిమాని ఆదివారం తన కాళ్లు పట్టుకున్నప్పుడు కూడా టెండూల్కర్ చాలా ఇబ్బందిగా కదిలాడు. అంపైర్లు అతన్ని వెంటాడి పట్టుకునేలోగానే టీవీలు ఆ దృశ్యాన్ని బంధించాయి. ఆ తర్వాత 108 పరుగుల వద్ద టెండూల్కర్ అవుటయ్యాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అది 80వ సెంచరీ. వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత సచిన్ టెండూల్కర్ ఆడుతున్న మొదటి మ్యాచు ఇదే.












Click it and Unblock the Notifications