వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jharkhand
రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధమైంది. గవర్నర్ సయ్యద్ అహ్మద్ శాసనసభను సుప్తాచేతనావస్థనలో ఉంచాలని సిఫార్సు చేస్తూ కేంద్రానికి ఓ నివేదిక పంపారు. కేంద్ర కేబినెట్ ఈ రోజు(గురువారం) నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ఎవరూ సాధారణ మెజారిటీ కూడగట్టలేని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాలకు సుముఖంగా లేవు.

జార్ఖండ్ ముక్తి మోర్చా(జెఎంఎం) మద్దతు ఉపసంహరణ దరిమిలా అర్జున్ ముండా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసిన నేపథ్యంలో జార్ఖండ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్ ఓ నివేదిక సమర్పించారు. రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన సిఫారసు చేశారు. జార్ఖండ్ గవర్నర్ ప్రాథమిక నివేదిక పంపిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్ షిండే ద్రువీకరించారు. దానిని పరిశీలించాల్సి ఉందని తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు వీలుగా శాసనసభను రద్దు చేయాలని గవర్నర్‌కు అర్జున్ ముండా సిఫార్సు చేశారు. ఆ సిఫార్సును గవర్నర్ ఆమోదించలేదు. కాంగ్రెసు ఇంత వరకు సభను రద్దు చేయాలని కోరలేదు. అలా అని ప్రభుత్వ ఏర్పాటుకూ చొరవ చూపడం లేదు. 2006 బిజెపిని గద్దె దించాలన్న లక్ష్యంతో జెఎంఎంతో కలిసి మధుకొడాకు మద్దతిచ్చింది. దాంతో అక్కడ కాంగ్రెసు - జెఎంఎం ప్రభుత్వం ఏర్పాటయింది.

అవినీతి కోణాలు బయటపడిన తర్వాత కాంగ్రెసు అపఖ్యాతిని మూటగట్టుకుంది. దీంతో మరోసారి జెఎంఎంతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెసు సుముఖంగా లేదు. తాజాగా గవర్నర్ సిఫార్సు నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకే కేంద్రం మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Jharkhand is headed for President's rule even though Congress is facing pressure from its MLAs as well as Jharkhand Mukti Morcha to form the alternative government in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X