మణిశంకర్ లఘుచిత్రంలో చంద్రబాబు యాక్టింగ్

బైరవ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ చిత్రం మూడు నిముషాల పాటు ఉంటుందని మణిశంకర్ మీడియాతో అన్నారు. ఇందులో రాష్ట్రాభివృద్ధితోపాటు, చంద్రబాబు చేస్తున్న పాదయాత్రకు సంబంధించి ఉంటుందని తెలిపారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుపై చిత్రీకరించినట్లు తెలిపారు.
కాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర ఖమ్మం జిల్లాలో మూడో రోజైన శుక్రవారం కూసుమంచి నుంచి ప్రారంభమయింది. చంద్రబాబు పాదయాత్ర ఖమ్మం జిల్లాలో ముగిసిన తర్వాత నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించనుంది. సంక్రాంతి పండుగ తరవాత ఆయన ఈ నెల 16వ తేదీ రాత్రి లేదా 17వ తేదీ ఉదయం నల్లగొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలోకి అడుగు పెడుతారు.
విద్యుత్ బిల్లులతో షాక్ కొట్టే పరిస్థితి వచ్చిందని, మానవత్వం లేని ప్రభుత్వం ఇప్పుడు ఉందని ఆయన తన పాదయాత్ర సందర్బంగా ఖమ్మం జిల్లా నేలపట్టులో అన్నారు. తాము అధికారంలోకి వస్తే పేదలను ఆదుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications