విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యుటిగా హైదరాబాద్: తెలంగాణకు వరంగల్, అంధ్రకు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యను ఈ నెలలోనే కచ్చితంగా తేల్చడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడినట్లు అర్థమవుతోంది. ఈ నెల 28ల తేదీలోగా తెలంగాణ సమస్యకు కేంద్ర ప్రభుత్వం నుంచి పరిష్కారం రానుంది. ఆ పరిష్కారం ఎలా ఉంటుందనేదే ఆసక్తికరంగా మారింది. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా (యుటిగా) చేసే ఆలోచనపై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

హైదరాబాదును కేంద్ర పాలితంగా ప్రాంతంగా చేసే అంశాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అకస్మాత్తుగా మీడియా సమావేశంలో తెర మీదికి తెచ్చారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించాలనే నిర్ణయానికి కాంగ్రెసు అధిష్టానం ఇప్పటికే వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే తెలంగాణ నాయకులతో పాటు సీమాంధ్ర నాయకులు కూడా సంతృప్తి చెందుతారని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రానికి వరంగల్‌ను, సీమాంధ్ర రాష్ట్రానికి విజయవాడను రాజధానులుగా చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నాడు కూడా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర మంత్రులతో తెలంగాణపై మాట్లాడినట్లు తెలుస్తోంది. పాత హైదరాబాద్ రాష్ట్రాన్ని యధాతథంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం లేదని అంటున్నారు.

కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి గ్రేటర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలను కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెబుతన్నారు. అయితే ఇది సాధ్యపడుతుందా అనేది అనుమానం. మహబూబ్ నగర్ కొన్ని ప్రాంతాలను మాత్రమే హైదరాబాద్ పరిధిలోకి తేవచ్చు. నల్లగొండ జిల్లాలోని 64 మండలాలను కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోకి తెచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

English summary
The government is also considering making Hyderabad an union territory, according to sources. Congress government is discussing dividing the state into two and makes Hyderabad a union territory with four district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X