జగన్‌కోసం సంతకం: రాష్ట్రపతికి ఇవ్వనున్న విజయమ్మ

YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదలను కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు రెండు కోట్ల సంతకాలను సేకరించింది. వీటిని విజయమ్మ ఈ రోజు రాష్ట్రపతికి అందజేయనున్నారు.

సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు విజయమ్మకు రాష్ట్రపతి అపాయింటుమెంట్ దొరికింది. విజయమ్మతో పాటు పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు విజయమ్మ పార్టీ నేతలతో కలిసి ఢిల్లీ బయలుదేరుతారు. జగన్ కోసం జనం సంతకం కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రెండు కోట్ల సంతకాలను సేకరించింది. తొలుత ఈ సంతకాలను డిసెంబర్ 31 తేది వరకు సేకరించాలని నిర్ణయించారు.

అయితే సంతకాలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తుండటంతో దీనిని తాము జనవరి 10వ తేది వరకు పొడిగించామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇటీవల చెప్పింది. ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు అత్యవసర సమావేశం కానున్నారు. రాష్ట్రపతిని కలిసి చర్చించాల్సిన అంశంపై ఈ భేటీలో వారు చర్చించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+