ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ గొంతు నాది కాదు: హేట్ స్పీచ్‌పై అక్బరుద్దీన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
ఆదిలాబాద్: నిర్మల్ బహిరంగ సభలో చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన గొంతు తనది కాదని మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసును ఎదుర్కుంటున్న అక్బరుద్దీన్‌ను పోలీసులు మంగళవారంనాడు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు విచారణ సాగింది. నిర్మల్ బహిరంగ సభ సిడీని చూపుతూ పోలీసులు ఆయన నుంచి వివిధ అంశాలను రాబట్టేందుకు ప్రయత్నించారు.

సభలో పాల్గొన్న మాట వాస్తవమేనని, అయితే సీడిల్లో గొంతు తనది కాదని ఆయన అన్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అక్బరుద్దీన్‌ను హైదరాబాద్ తరలించాలని ఆయన తరఫు న్యాయవాదులు అక్బర్ హుస్సేన్, బాలరాజు పోలీసులను కోరారు. అక్బరుద్దీన్ ఆరోగ్యం బాగా లేదని అంటూ అందువల్ల హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాలని ఓవైసీ ఆస్పత్రి వైద్యుడు మజరుద్దీన్ అలీఖాన్ సూచించారు.

అయితే, నిర్మల్ పోలీసుల కస్టడీలో ఉన్న మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన రిమ్స్ వైద్యులు తెలిపారు. స్థానిక ఎఆర్ హెడ్ కార్వర్స్‌లో మూడో రోజు ఆయనను పోలీసులు ప్రశ్నించారు. ఆయన వ్యక్తిగత అభిరుచులు, విద్యాబోధన, రాజకీయ రంగ ప్రవేశం వటి అంశాలపై కూడా పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం.

అక్బరుద్దీన్‌ను కోర్టు అనుమతితో పోలీసులు ఐదు రోజుల పాటు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 17వ తేదీ ఉదయం పోలీసులు ఆయనను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. నిర్మల్ సభలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై ఆయనను నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Police have questioned MIM MLA Akbaruddin Owaisi on his alleged hate speech at Nirmal of Adilabad district. He said that the voice in the CD is not belongs to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X