జల్లికట్టులో బాలయ్య హంగామా: బావిలో పడిన ఎద్దు

బాలయ్య రాకతో పుల్లయ్యగారిపల్లి తెలుగు తమ్ముళ్లు, ప్రజలు ఆనందంలో తెలిపోయారు. బాలకృష్ణ మొదట స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అభిమాని ఇంట్లో ఫలహారం చేశారు. అనంతరం ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు. బాలయ్య జల్లికట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలయ్య రావడం తమకు మరింత ఉత్సాహాన్ని కలిగించిందని స్థానికులు అన్నారు. బాలకృష్ణ కూడా జల్లికట్టును చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
జల్లి కట్టు అనేది తమ చిన్నప్పటి నుండి వస్తున్న ఆనవాయితీ అన్నారు. పోలీసులు జల్లికట్టును అడ్డుకోవడం సరికాదన్నారు. జల్లికట్టులో ఎక్కడా రక్తపాతం జరగదన్నారు. జల్లి కట్టుకు బాలయ్య రావడం డబుల్ ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. ఆయన వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ అన్నారు. ఆయనను ఎప్పుడూ టీవీల్లో చూడటమేనని ఇప్పుడు నేరుగా చూడటంతో సంతోషం కలుగుతోందన్నారు. ప్రతి సంవత్సరం జల్లికట్టులో ఎంజాయ్ చేసినట్లుగా మరెక్కడా చేయమన్నారు.
జల్లికట్టులో పొడిచిన ఎద్దు
చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె జల్లికట్టు ఆటలో ఓ ఎద్దు ఒకరిని పొడవటంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అతనిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరోవైపు రంగంపేట జల్లి కట్టు మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ ఎద్దు, ఓ బాలుడు బావిలో పడ్డారు.












Click it and Unblock the Notifications