నా భర్తను ఉరితీయండి, నన్నూ వేధించాడు: రేపిస్ట్ భార్య

My husband should be hanged, demands wife
ముంబయి: జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధిమారకుండా చిన్నారి పైన అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన తన భర్తకు ఉరిశిక్షే సరైనదని షిరిడీ రేప్ ఘటన నిందితుడి భార్య పేర్కొంది. అతడు తన భర్త అని చెప్పుకోవడానికే తాను సిగ్గుపడుతున్నానని, ఇంత దారుణానికి ఒడిగట్టిన అతడిని ఎంత త్వరగా ఉరి తీస్తే అంత మంచిదని నిందితుడి సతీమణి సారికా సాల్వే అన్నారు. ఇలాంటి క్రూరత్వానికి ఒడిగట్టిన తన భర్తను ఉరి తీయాలని ఆ 28 ఏళ్ల భార్య పేర్కొంది.

సునీల్ సురేష్ అలియాస్ పప్పు సాల్వే(32) అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి రేప్ చేసి ఆ తర్వాత హత్య చేసిన ఘటనలో అరెస్టయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో డిసెంబర్ 28న జరిగింది. మృతి చెందిన చిన్నారి వయస్సు కేవలం తొమ్మిది. పోలీసులు అతనిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అతనికి ఈ నెల 17వ తేది వరకు కోర్టు రిమాండు విధించింది.

తన భర్త దుశ్చర్యకు తాను సిగ్గుపడుతున్నానని భార్య సోమవారం అంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. తన భర్త తనను ఎప్పుడూ కొట్టి వేధించే వాడని ఆమె తెలిపింది. అతని బాధ భరించలేక తాను ఓసారి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశానని, ఆసుపత్రిలో చేర్పించారని, చాలా రోజుల తర్వాత తాను ప్రాణాలతో బయటపడ్డానని తెలిపింది. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు అతను తనను కలిసేందుకు రాలేదని తెలిపింది. జైలు నుండి విడుదలైనా తన వద్దకు రాలేదని తెలిపింది.

కోర్టులో తన భర్తకు వ్యతిరేకంగా చెప్పాల్సి వస్తే తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. కాగా 2003లో నిందితుడు అత్యాచారం, హత్య కేసులో అరెస్టయ్యాడు. అప్పటి ఘటన నాసిక్ జిల్లాలోని సినార్ ప్రాంతంలో జరిగింది. నాసిక్ కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. ఇతను బాంబే హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. అత్యాచారం, హత్య కింద అతనికి నాసిక్ కోర్టు పదిహేడేళ్లు(పది ప్లస్ ఏడు) జైలు శిక్ష విధించింది.

అయితే అతని సత్ర్పవర్తన కారణంగా జైలు అధికారులు అతనిని 28 మే 2012న విడుదల చేశారు. నిందితుడు జైలు నుండి విడుదలైన తర్వాత షిరిడి నుండి తొమ్మిదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటన 28 డిసెంబర్ 2012న జరిగింది. బాలికను హత్య చేసిన తర్వాత ఎవరూ లేని ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని నిందితుడు ఉంచాడు. జనవరి 11న బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+