ప్రధానిని 24గంటల్లో అరెస్ట్ చేయాలి: పాక్ సుప్రీం ఆదేశం

రాజా పర్వేజ్ అష్రఫ్ అవినీతి ఆరోపణలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు సంఘాలు ప్రధానికి వ్యతిరేకంగా రాస్తారోకోలు నిర్వహించాయి. తెహిరుల్ ఖాద్రీ ఆధ్వర్యంలో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ప్రధానిని తొలగించాలని, ఆయనను అరెస్టు చేయాలని పలువురు నిరసనకారరులు డిమాండ్ చేస్తున్నారు.
ఖాద్రీ దాదాపు పదివేల మందితో రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని, ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలని, ప్రజలకు నష్టం చేసే ప్రభుత్వం వద్దని, ప్రభుత్వం చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని వారు ఆరోపించారు.
62 ఏళ్ల అష్రాఫ్ గత సంవత్సరం జూన్‌లో ప్రధానిగా నియమించబడ్డారు. అప్పటి ప్రధాని యూసఫ్ రాజా గిలానీని ఆ పదవి నుండి తొలగించాలని ఆదేశించడంతో ఆయన స్థానంలో అష్రాఫ్ వచ్చారు. ఇతను పవర్ ప్రాజెక్టుల్లో భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications