అందుకే జగన్ అరెస్టు: విజయమ్మ, లోకేష్‌కు కౌంటర్

సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఎన్ని రోజులు జైలులో పెడతారని ప్రశ్నించారు. కాంగ్రెసు, టిడిపిలు కలిసి జగన్‌ను టార్గెట్ చేశాయన్నారు. ఇప్పటి వరకు సిబిఐ జగన్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కనిపెట్టలేక పోయిందన్నారు. లక్ష కోట్లు అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన తనయుడి పైన దుష్ప్రచారం చేస్తున్నారని, ఒక లారీలో ఎన్ని వందల కోట్ల రూపాయలు పడతాయో బాబుకు, ఆయన కొడుకు నారా లోకేష్‌కే బాగా తెలుసునని కౌంటర్ ఇచ్చారు.
సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఇన్నాళ్లూ జైలులో పెట్టడం అనైతికమన్నారు. ఓదార్పు యాత్రకు కాంగ్రెసు పార్టీ ఆంక్షలు విధించిందన్నారు. ఇరవై రోజుల్లో జగన్ కోసం రెండు కోట్ల మంది సంతకాలు చేశారన్నారు. జగన్‌కు క్షమాభిక్ష పెట్టమనో, కేసు కొట్టివేయమనో తాము రాష్ట్రపతిని కోరలేదని, విచారణ త్వరగా జరిగేలా చూడాలని, ఉన్నది ఉన్నట్లుగా న్యాయం చేయాలని మాత్రమే తాము కోరామన్నారు.
కొన్ని ఛానల్స్ జగన్ పైన చేస్తున్న ప్రచారం చూస్తుంటే బాధేస్తోందన్నారు. బెయిల్ రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ధి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేశారని, ఆయనకు దోచుకోవడం దాచుకోవడం తెలియదని, ఉన్నది ఇతరులకు పెట్టడమే తెలుసునన్నారు. జవాబుచెప్పుకోలేరని వైయస్ పేరును ఛార్జీషీటులో పెట్టారన్నారు. క్విడ్ ప్రోకోకు జగన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. 2009 వరకు జగన్ ఏ పదవిలో లేరన్నారు.
కాంగ్రెసు నుండి అతను బయటకు వచ్చిన వారం రోజుల్లో కోర్టు నోటీసులు వచ్చాయన్నారు. జగన్‌తో పాటు ఆయన అభిమానుల ఇళ్ల పైనా ఐటి దాడులు చేస్తున్నారన్నారు. సురేష్ కల్మాడీ, రాజా, కనిమొళి వంటి ఎంపీలకు బెయిల్ వచ్చినప్పుడు జగన్‌కు ఎందుకు రాదని ప్రశ్నించారు. 26 జివోలతో జగన్‌కు ఎక్కడా సంబంధం లేదన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఓ న్యాయం, మంత్రి ధర్మాన ప్రసాద రావుకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. మోపిదేవిని బలిపశువును చేశారన్నారు.
చట్టం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండదన్నారు. సిబిఐ తీరును తాము ప్రణబ్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ప్రణబ్‌తో భేటీని రాజకీయం చేయొద్దన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో విజయమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశంలో చెప్పిందే తమ వైఖరి అని విజయమ్మ అన్నారు. తన తనయ షర్మిలకు ఫిజియోథెరపీ జరుగుతోందని, 28న ఎంఆర్ఐ తీస్తారని, 29వ తేదిన ఆమె పాదయాత్ర పైన ఓ స్పష్టత వస్తుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications