ఫొటోలు: మన బియ్యం పథకానికి సిఎం శ్రీకారం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని తెలుగు లలితకళా తోరణంలో బుధవారం ఉదయం మన బియ్యం పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతగా నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఈ పథకాన్ని అమలు జరగనుంది. మన బియ్యం పథకం కింద ప్రభుత్వం రూపాయికి కిలో నాణ్యమైన బియ్యాన్ని అందజేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, స్థానిక పార్లమెంటు సభ్యులు, పలువురు నేతలు పాల్గొన్నారు. మన బియ్యం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. కమిషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ వారు ముఖ్యమంత్రి ఎదుట నిరసనకు దిగారు.
ఏ విధంగా కమిషన్ పెంచాలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని పౌర సరఫరాల మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని వారికి చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే జీవో విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మన బియ్యం పథకంలో స్థానికంగా లభించే బియ్యాన్నే రేషన్ దుకాణాల్లో విక్రయిస్తారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం హైదరాబాదులోని లలిత కళాతోరణంలో మన బియ్యం పథకాన్ని ప్రారంభించిన తర్వాత లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు.

స్థానికంగా పండిన పంటను స్థానికంగా మన బియ్యం పథకం ద్వారా అందించడంలో మన బియ్యం పథకంలో ఒక భాగం. పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు.

మన బియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

మన బియ్యం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలనం చేశారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ముఖేష్, దానం నాగేందర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications