కలిసి ఉంటేనే కలదు అభివృద్ధి: తెలంగాణపై పల్లంరాజు

Pallam Raju
విజయవాడ: రాష్ట్రం కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పల్లంరాజు అన్నారు. రాష్ట్రానికి 42 మంది పార్లమెంటు సభ్యులు ఉండడం వల్ల ప్రాముఖ్యం ఉంటుందని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఆయన బుధవారం కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వ్యక్తిగతంగా తాను సమైక్యాంధ్రను సమర్థిస్తానని ఆయన చెప్పారు.

రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలను తమ కాంగ్రెసు అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తామని, ఆంధ్రప్రదేశ్ ఐక్యంగా ఉండాలనేదే తన అభిమతమని అన్నారు. అధిష్టానం అందరి అభిప్రాయాలనూ గౌరవిస్తుందని ఆయన చెప్పారు.

తెలంగాణ విషయంలో తాను కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందరు కాంగ్రెసు నాయకులు కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని రాష్ట్ర మంత్రి పార్థసారథి అన్నారు. తాను తెలంగాణ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మరో రాష్ట్ర మంత్రి మాణిక్యవరప్రసాద్ అన్నారు.

తమకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. హైదరాబాదులో గురువారం ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర నేతల సదస్సును ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే నాయకులంతా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయన బుధవారం హైదరాబాదులో పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+