హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఇస్తామని చెప్పారా?: డిఎల్, సమైక్య రగడ

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: తెలంగాణ ఇస్తారని ఎవరు చెప్పారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి శుక్రవారం అన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. ఎలాంటి నిర్ణయం వచ్చినా తాను పార్టీని వీడనని చెప్పారు. విభజనపై ప్రస్తుతం వస్తున్నవన్నీ ఊహాగానాలేనని ఆయన కొట్టి పారేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెఫరెండం అనడం విచిత్రమన్నారు.

ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా రెఫరెండం జరగలేదన్నారు. కెసిఆర్ రెఫరెండం మాటలు ఉత్తుత్తివే అన్నారు. గురువారం జరిగిన సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో రాజీనామాల అంశం చర్చకు రాలేదన్నారు. తాను ఢిల్లీ వెళ్లడం లేదన్నారు తెలంగాణ ఇస్తారనేది మీడియా సృష్టేనని, ఇప్పటి వరకు తెలంగాణకు ఎలాంటి అనుకూల సంకేతాలు రాలేదన్నారు. కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. సీమాంధ్ర నేతల తీర్మానానికి తాను మద్దతు పలికానన్నారు. జైపూర్ సదస్సులో తాను పాల్గొంటున్నట్లు చెప్పారు.

సమైక్యాంధ్ర విద్యార్థి నేతల అరెస్ట్

నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 14 విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థి నేతలు భేటీ అయ్యారు. అనంతరం వారు హైదరాబాదులో సమైక్యాంధ్ర సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిపిని విద్యార్థులు కలిసే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... రాష్ట్రాన్ని విభజించవద్దని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఆమె మాదిరిగా సోనియా గాంధీ సమైక్యానికి కట్టుబడి ఉండాలన్నారు. సమైక్యాంధ్రకే సీమాంధ్ర ప్రజలు కట్టుబడి ఉన్నారన్నారు. రాష్ట్రం విభజించే పరిస్థితి వస్తే నాయకులు చెబితే వినే స్థితిలో సీమాంధ్ర ప్రజలు లేరన్నారు. సమైక్యంగా లేకపోతే ఇతర ప్రాంతాలకు ఎండిపోయే ప్రమాదముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో కేంద్రం తొందరపాటు నిర్ణయం తీసుకుందన్నారు. మరోసారి అలా జరగవద్దన్నారు.

English summary
Minister DL Ravindra Reddy said on Friday that there is no signs of Telangana from Central Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X