పార్టీ ముఖ్యంకాదు: గంటా, పార్థసారథి సరికొత్త సూచన

సమైక్యాంధ్రలో ఉద్యమాలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విభజిస్తే నీటితో పాటు పలు సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. విభజనకు అనుకూలంగా ప్రకటన వస్తే 2009 పరిస్థితి పునరావృతం అవుతుందన్నారు. ఎవరెవరు రాజీనామాలు చేస్తారన్న అంశం తర్వాత తేలుతుందన్నారు.
కర్నాటకలో కలపాలి
విభజన అనివార్యమైతే అనంతపురం జిల్లాను కర్నాటక రాష్ట్రంలో కలపాలని మంత్రి పార్థసారథి విజయవాడలో అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నుండి ప్రకటన వస్తే తమ ప్రాంత నేతలం అందరం సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
బాబు నిర్ణయమే
రాష్ట్ర విభజన విషయంలో తాము తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత శుక్రవారం అన్నారు. పార్టీ నిర్ణయమే తన నిర్ణయమన్నారు.












Click it and Unblock the Notifications