ముంబై దాడుల కేసు: రాణాకు 14 ఏళ్ల జైలుశిక్ష

అలాగే, డేనిష్ పత్రిక కార్టూనిస్ట్ హత్యకు వేసిన పథకంలోనూ రాణాకు ప్రమేయం ఉన్నదని తేల్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాణాకు తక్కువలో తక్కువ శిక్ష విధించాలన్న ఆయన తరపు న్యాయవాదుల వాదనను కోర్టు తోసిపుచ్చింది.
అలాగే, పాఠశాల చదువుల నాటి స్నేహితుడు డేవిడ్ హెడ్లీ కోరడం వల్లనే రాణా ఇదంతా చేశాడన్న వివరణనూ పరిగణనలోకి తీసుకోలేదు. రాణాను 2011 జూన్‌లో ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ దోషిగా నిర్ధారించింది.
ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నవారు తమకు ఏమవుతోందనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదని, కస్టడీలో ఉన్నంత వరకు రాణా అటువంటి చర్యలకు దిగడానికి వ్యక్తిగతంగా వీలు కాదని, భవిష్యత్తులో ఉగ్రవాద చర్యలకు దిగకుండానే రాణాకు దీర్ఘ శిక్ష వేస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications