హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా కడుపుమంట తెల్సు, కెసిఆర్‌నే అడగాలి: దామోదర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Damodara Rajanarsimha
హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ కడుపుమంట కేంద్రానికి తెలుసునని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అందరూ ప్రత్యేక తెలంగాణను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల కడుపుమంట కేంద్రానికి, తమ పార్టీ అధిష్టానానికి కూడా తెలుసునని ఆయన అన్నారు. రాజధాని హైదరాబాదుపై ఎలాంటి రెఫరెండం అవసరం లేదని దామోదర అన్నారు.

హైదరాబాదు ప్రజలు కూడా తెలంగాణను కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ అధిష్టానం, కేంద్రం 9 డిసెంబర్ 2009 నాటి ప్రకటనకు కట్టుబడి ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 28 వరకు తెలంగాణకు పరిష్కారం చూపిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగానే ప్రకటన ఉంటుందని భావిస్తన్నానని అన్నారు.

తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెసులో విలీనం చేస్తారో లేదో అనే విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును అడగాలన్నారు. పార్టీలో యువ నాయకత్వం అవసరం చాలా ఉందన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులుగా యువనేత రాహుల్ గాంధీని ఎన్నుకోవడం ఆనందించదగ్గ విషయం అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే తాము 2014లో ఎన్నికలకు వెళతామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీయో విజయం సాధిస్తుందన్నారు.

కెసిఆర్‌కు న్యూడెమోక్రసీ ఆహ్వానం

న్యూడెమోక్రసీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి న్యూడెమోక్రసీ అన్ని పార్టీలకు ఆహ్వానం పంపింది. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కూడా ఆహ్వానం అందింది.

English summary
Deputy CM Damodara Rajanarsimha said on Sunday that Cental Government and High Command know Telangnana sentiment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X