హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అత్త, భర్త కోసం సోనియా ఏడ్చారు కానీ: నాగం ఆవేదన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram-Nagam Janardhan Reddy
హైదరాబాద్: 28వ తేదిలోపు తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నుండి ఎలాంటి ప్రకటన రాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ప్రాంత నేతలు హెచ్చరించారు. సోమవారం న్యూడెమోక్రసీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత నేతలు సమావేశమయ్యారు. భేటీ అయ్యాక పలువురు నేతలు మాట్లాడారు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం ఆగదని న్యూడెమోక్రసీ నేతలు అన్నారు. తెలంగాణకు అనుకూల ప్రకటన రాకుంటే 28 తర్వాత మిలిటెంట్ తరహా ఉద్యమాన్ని చేపడతామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెసు పార్టీయే ప్రధాన అడ్డంకి అన్నారు.

తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల పైన రాజకీయ ఒత్తిడి తీసుకు రావాలన్నారు. తెలంగాణకు అడ్డుపడుతున్న వారే టార్గెట్‌గా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ అన్నారు. మాలో శక్తి తగ్గలేదని, తెలంగాణ ఇవ్వకుంటే ఉద్యమం తీరు మారుతుందన్నారు. మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేస్తామన్నారు. తెలంగాణను అడ్డుకుంటున్న సీమాంధ్రులనే లక్ష్యంగా రహస్య కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

ఎన్నికలే లక్ష్యంగా ఉద్యమాలు చేయవద్దని నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు పార్టీని తెలంగాణలో ఉరి తీయాలన్నారు. తన అత్తను, భర్తను కోల్పోయినందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కంటతడి పెట్టారని మరి, తెలంగాణ కోసం వెయ్యి మంది ఆత్మాహుతి చేసుకుంటే స్పందించరెందుకన్నారు. ఈ నెల 28 తర్వాత కాంగ్రెసు జెండా లేకుండా చేయాలన్నారు.

కాంగ్రెసు పార్టీ ఓ విచిత్ర పార్టీ అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. పార్లమెంటులో తెలంగాణపై బిల్లు పెట్టే వరకు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

సీమాంధ్ర నేతలపై టి-కాంగ్ మండిపాటు

హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని మాజీ మంత్రి శంకర రావు వేరుగా అన్నారు. హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రమంటున్న వారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. వారివి అవగాహన లేని మాటలన్నారు. వారి మాటలు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగా లేదన్నారు. రాహుల్ గాంధీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. తాము రేపు ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారు.

హైదరాబాద్ తెలంగాణలో భాగమని ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కార్యాచరణ తీవ్రంగా ఉంటుందన్నారు. తెలంగాణను సీమాంధ్ర నేతలు అడ్డుకోవాలని చూస్తే ఒక్కరోజు కూడా హైదరాబాదులో వ్యాపారం చేయలేరన్నారు. తెలంగాణ వారిని రెచ్చగొట్టేలా సీమాంధ్ర నేతలు మాట్లాడవద్దని ఎమ్మెల్యే కెఎల్ఆర్ అన్నారు.

English summary
Telangana Political JAC chairman Kodandaram said that they are ready to militant style fight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X