వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్పుతెచ్చాం, రాహుల్ కోసం జగన్ కలువొచ్చు: టిజి

By Srinivas
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
హైదరాబాద్/న్యూఢిల్లీ: తమ ప్రాంత నేతలతో చర్చించకుండా ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే రాష్ట్రం అట్టుడుకుతుందని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం హైదరాబాదులో అన్నారు. విభజన జరిగితే తమ సీమ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వస్తుందన్న ప్రచారం నేపథ్యంలోనే తాము ఢిల్లీకి వెళ్లామని ఆయన చెప్పారు. తమ పార్టీ అధిష్టానం ఆలోచనలో మొన్నటికి ఇప్పటికీ తాము మార్పులు తేగలిగామని టిజి వెంకటేష్ అన్నారు.

గతంతో పోలిస్తే మార్పు తెచ్చామన్నారు. ఒకటి రెండు రోజుల్లో పరిస్థితులు అన్నీ సర్దుకుంటాయని ఆయన చెప్పారు. నిర్ణయం ఏదైనా మీడియా సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పరిణామాలను పరిశీలిస్తే విభజన జరిగే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదన్నారు. తెలంగాణవాదులు భావించే సమస్యలకు విభజనే పరిష్కారం కాదన్నారు. అందరూ కలిసి ఉండి అభివృద్ధి చెందాలన్నారు.

ఎవరు కూడా రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయవద్దన్నారు. సెంటిమెంట్ ద్వారా తెలంగాణ కోరుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ఎవరూ రెచ్చగొట్టవద్దన్నారు. రాష్ట్ర విభజన పైన నిర్ణయం కోసం మరింత సమయం తీసుకోవాలని అధిష్టానాన్ని తాము కోరినట్లు చెప్పారు. ఎన్నికలలోపు తెలంగాణపై ఎలాంటి నిర్ణయం రాదని ఆయన అన్నారు.

నూటికి నూరుపాళ్లు విభజన ఉండకపోవచ్చునని చెప్పారు. సమస్యల ఆధారంగా విభజన జరిపితే ప్రతి జిల్లా వారు విభజనను కోరుకుంటాలని ఆయన అన్నారు. తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసులో కలిసిపోతారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Minister TG Venkatesh said on Wednesday that YSR Congress Party chief YS Jaganmohan Reddy may align with Congress party for Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X