వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపిపై దుమ్మెత్తిపోసిన యాష్కీ: రేప్‌కంటే ద్రోహం: గుత్తా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gutha Sukender Reddy-Madhu Yashki
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కెవిపి రామచంద్ర రావు డబ్బులతో విశాలాంధ్ర నేత పరకాల ప్రభాకర్ వెయ్యి అబద్దాలతో 'తెలంగాణవాదుల నూటొక్క అబద్దాలు' పుస్తకం ద్వారా పరకాయ ప్రవేశం చేసే ప్రయత్నం చేశారని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ బుధవారం న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జరగబోతుందన్న సమయంలో కెవిపి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని యాష్కీ ధ్వజమెత్తారు.

కేంద్రం ప్రకటించబోయే తెలంగాణను అడ్డుకోవాలని చూస్తే ఇక బలిదానాలు ఉండవని బలవంతంగా గుంజుకోవడమే అన్నారు. కెవిపి జైల్లో ఉండాల్సిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి తెలంగాణకు అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నది కెవిపియే అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో కృత్రిమ ఉద్యం సృష్టిస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. తెలంగాణకు అడ్డుపడే వారని బహిష్కరించాలన్నారు.

తెలంగాణ వస్తే సరేనని లేదంటే, రాజకీయాలకతీతంగా అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఇదే అంతిమ పోరాటం కావాలని యాష్కీ ఆకాంక్షించారు. కెవిపి శకుని పాత్ర పోషస్తున్నారన్నారు. సీమాంధ్ర నేతల ఒత్తిడికి కేంద్రం తలొగ్గేలా కనిపిస్తోందన్నారు. అసదుద్దీన్ ఓవైసీ అరెస్టు కక్ష సాధింపన్నారు. ఇలా చేస్తే మైనార్టీలు కాంగ్రెసుకు దూరమవుతారన్నారు. తెలంగాణకు అడ్డుపడే వారు ఢిల్లీ గ్యాంగ్ రేప్ నిందితుల కంటే పెద్ద ద్రోహులు అని గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. 56లో బలవంతంగా పెళ్లి చేశారని, ఇప్పటి వరకు బలవంతంగా కాపురం చేశామని, విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎపిఎన్జీవోలు కొత్త అవతారం ఎత్తారని, తెలంగాణ అడ్డుకుంటే నష్టపోయేదే ఆంధ్రా వారే అన్నారు.

పరకాల ప్రభాకర్ ఇంత పెద్ద పుస్తకానికి తాను రెండు పేజీలలో సమాధానం చెప్పేందుకు వచ్చానని కె కేశవ రావు అన్నారు. వారికి డబ్బుంది కాబట్టి కలర్ ఫుల్ పుస్తకాలని తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. తాము విడిపోవాలని భావిస్తున్నామని అన్నారు. కలిసుండేందుకు ఇరు ప్రాంతాల ప్రజల అభిప్రాయం కావాలని కానీ, తాము విడిపోవాలనుకుంటున్నప్పుడు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు.

కలిసి ఉండేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. 2004 కాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశం ఉందని కెకె గుర్తు చేశారు. ఇప్పటికే కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు తాము భావిస్తున్నామని, తెలంగాణ వచ్చినట్టే అన్నారు. ఒకవేళ రాని పక్షంలో తాము పోరాడి సాధించుకుంటామన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించడంలో తమలో ఎలాంటి రాజీ లేదన్నారు.

English summary
Nizamabad MP Madhu Yashki has lashed out at Congress Party senior leader KVP Ramachandra Rao on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X