'మేం గెలిపిస్తాం.. అమ్ముడుపోవద్దు': మూడో సిడి రిలీజ్

Chandrababu Naidu
విజయవాడ: నాయకులు అమ్ముడు పోతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. బాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన పలుచోట్ల మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కుళ్లబొడవాలన్నారు. రానున్న సహకార ఎన్నికలలో ఆ పార్టీని గెలిపిస్తే రుణమాఫీని కూడా మింగేస్తారని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలకు వెళ్ళే సత్తాలేదని దుయ్యబట్టారు. పంచాయతీల కాలపరిమితి ముగిసినా, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, జడ్‌పీటీసీలకు ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తూ వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతోనే సహకార ఎన్నికలకు ప్రభుత్వం వెళుతోందని విమర్శించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎట్టిపరిస్థితులలోను అవకాశం కల్పించవద్దని పదేపదే కోరారు.

కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రెండూ రుణమాఫీకి వ్యతిరేకమన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ ఫోన్ల నుంచి 5 ఎస్సెమ్మెస్‌లు అవినీతి వ్యతిరేకత కోసం పంపిస్తే.. ఒక ఉద్యమం ఊపందుకుంటుందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు.

నాగార్జున సాగర్ ఆయకట్టు కింద పంటలకు నీళ్లు అందని పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం తక్షణం నాగార్జున సాగర్ నుండి కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నేతలు అమ్ముడుపోతున్నారని చంద్రబాబు చెప్పగా... సభలోని కొందరు.. నాయకులు ఎవరూ అమ్ముడు పోవద్దని టిడిపిని గెలిపిస్తామని అన్నారు.

మూడో సిడి విడుదల

చంద్రబాబు పాదయాత్ర కోసం తయారు చేసిన మూడో సిడిని టిడిపి మంగళవారం విడుదల చేసింది. రైతన్నకే తొలి సంతకం.. రాష్ట్రానికే బతుకంకితం.. ఇదే చంద్రబాబు సంకల్పం అంటూ సాగే పాటను ఇందులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+