బ్రోతల్ హౌస్ నుండి జూనియర్ ఆర్టిస్టులకు విముక్తి

ఎక్కువ మంది బ్యూటీ పార్లర్లు, మసాజ్ సెంటర్ల పేరుతో వీటిని నడుపుతున్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. నిర్వాహకులు దేశంలోని పలు నగరాల నుండి యువతులను వీక్లీ, మంత్లీ బేసిస్ మీద తీసుకు వచ్చి వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిర్వాహకులు ప్రకటనలు, ఫోన్ల ద్వారా తమ వ్యాపారాన్ని పెంపొందించుకుంటున్నట్లుగా గుర్తించారు. పోలీసులు రక్షించిన యువతుల్లో ముంబయి, కోల్‌కతా, న్యూఢిల్లీ, కేరళలోని పలు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు.
ఢిల్లీలో ఇద్దరికి విముక్తి
యువతులకు ఉపాధి ఆశ చూపి వేశ్యాగృహాలకు విక్రయిస్తున్న మహిళ గుట్టు రట్టయింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంకు చెందిన మహిళ ఆర్థిక ఇబ్బందులున్న కుటుంబాల్లో యువతులను ఆకర్షించి సాయపడతానంటూ నమ్మించి, ఆలూరు రోడ్డుకు చెందిన ఇద్దరు యువతులను విజయవాడకు తరలించింది.
విజయవాడ బస్టాండులో మరో మహిళను చూపి ఉపాధి కల్పించేది ఈమేనని నమ్మించి.. ఇందుకుగాను ఆమెకు లక్ష రూపాయలు అందినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ ఇద్దరు యువతులను ఢిల్లీలోని ఓ వేశ్యా గృహానికి తరలించడంతో తాము మోసపోయామని తెలుసుకున్నారు. ఓ యువతి తప్పించుకొని వచ్చి పొన్నూరులో కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో బాధితుల బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఢిల్లీ వెళ్లిన పోలీసులు అక్కడ ఇద్దరు యువతులను అక్కడ నుండి తీసుకు వచ్చారు.












Click it and Unblock the Notifications