మూడేళ్ల చిన్నారిపై యువకుడి దాష్టీకం, హత్య

అందరూ అక్కడి నుండి వెళ్లగానే మూడేళ్ల ఈ పాపను పక్కనే ఉన్న పత్తి చేలోకి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బిస్కట్లు కొనుక్కునేందుకు వెళ్లిన పిల్లలు వచ్చే సరికి రాజేష్ పాపను భజంపై వేసుకొని బావి వైపు వెళ్తూ కనిపించాడు. పిల్లలకు అనుమానం వచ్చి పెద్దలకు చెప్పారు. పెద్దలు వచ్చి చూడగా చిన్నారి మృతి చెంది ఉంది. ఆమెను బావిలో పడేసేందుకు రాజేష్ ప్రయత్నించగా వారు చూశారు. స్థానికులు రాజేష్‌ను కట్టేసి కొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.
పడవ బోల్తా
శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని బందరువానిపేట వద్ద ఉదయం సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్సకారుల పడవ ఒకటి బోల్తా పడింది. ఈ ఘటనలో లక్ష్మయ్య అనే యాభై అయిదేళ్ల వ్యక్తి మృతి చెందాడు. పడవలో ఉన్న మిగతా వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications