హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రాహ్మణి భూములు వెనక్కి: వైయస్ టైంలో కేటాయింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాదు ప్రాంతంలోని బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో 250 ఎకరాలను ఐటి పార్కుకోసం ప్రభుత్వం బ్రాహ్మణి సంస్థకు కేటాయించింది. ఒప్పందం ప్రకారం ఏడాదిలోగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే, గడువు ప్రకారం పనులేవీ ప్రారంభం కాకపోగా 2011 ఏప్రిల్ 15న ప్రభుత్వం నోటీసులు జారీచేసింది.

దీంతో ప్రాజెక్టు చేపట్టలేమని, భూమిని తిరిగి ఇచ్చేస్తామని ఆ సంస్థ బదులిచ్చింది. ఈ నేపథ్యంలో భూమి స్వాధీనానికి ఎపిఐఐసిఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. భూమి కోసం బ్రహ్మణి ఇన్‌ఫ్రాటెక్ గతంలో చెల్లించిన సొమ్మును ఎపిఐఐసి వాపసు చేసింది. ఇంతకు ముందు కూడా ఇందూ, రహేజా ఇన్‌ఫ్రాటెక్‌లు కూడా భూములు పొంది తర్వాత వెనక్కువెళ్లాయి.

ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం ఎపిఐఐసిని భూములు వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. 2006లో జరిగిన ఒప్పందం ప్రకారం.. కంపెనీ 12 నెలల్లో ప్రారంభించాలి. ఐటి కంపెనీని ఐదేళ్లలో పూర్తి చేయాలి. మొత్తం 45 వేల మందికి ఉపాధి కల్పించాలి. ప్రారంభంలో ఇరవై వేల మందికి, కంపెనీ పూర్తయ్యాక మిగిలిన ఇరవై అయిదే వేల మందికి ఉపాధి కల్పించాలి. కానీ కంపెనీ అలా చేయలేకపోయింది. దీంతో వెనక్కి తీసుకున్నారు.

కాగా గతంలో కడప జిల్లాలోని బ్రాహ్మణి స్టీల్స్, ఖమ్మం జిల్లాలోని రక్షణ స్టీల్స్‌కు కేటాయించిన భూములను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. బ్రాహ్మిణీ స్టీల్స్ కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందినది కాగా, రక్షణ స్టీల్స్ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమార్‌కు చెందినదిగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎంవోయులు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిలో జరిగినవి.

English summary
The state government has decided to cancel yet another controversial momorandu of understanding(MoU) signed during YSR's regime, this time Infra tech Pvt Ltd to develop an IT SEZ spread over 250 acres in Maheswaram mandal in Ranga Reddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X