'తెలంగాణ వేడెక్కుతోంది: త్వరగా తేల్చేయకుంటే కష్టమే'

ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తమ పార్టీకి ముఖ్యమైనది. కాబట్టి ఈ సమస్యను ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టం జరుగుతుందనే అభిప్రాయంతో అధ్యక్షురాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సమస్యను నాన్చితే ఇరు ప్రాంతాల్లో నష్టమేననే భావన ఆమెలో ఉన్నదని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణకు సంబంధించి ప్రకటన చేసే ముందు కట్టుదిట్టమైన గట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సోనియా కోర్ కమిటీతో వరుసగా భేటీ అవుతూ తెలంగాణపై చర్చిస్తున్నారు. శనివారం ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండేలు సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. వీరంతా భవిష్యత్ కార్యాచరణపై మేడమ్‌తో కీలక సమాలోచనలు జరిపారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన జై ఆంధ్రప్రదేశ్ సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. రాష్ట్రంలో క్రమక్రమంగా మరోసారి ఘర్షణ వాతావరణం తీవ్రతరమవుతోందని, పార్టీలో పూర్తిస్థాయి విభజన కనిపిస్తోందని కోర్ కమిటీలో చర్చకు వచ్చిందని తెలుస్తోంది. ఆజాద్ ప్రకటన తర్వాత తెలంగాణలో వ్యక్తమైన మనోభావాలు, ప్రకటనలు కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.
షిండే సోమవారం బంగ్లాదేశ్ వెళుతున్నందువల్ల ఆయన వెళ్లేలోపు ఒక ప్రకటన చేసే అవకాశాలపైనా సమావేశంలో చర్చించారట. ఈ నేపథ్యంలో షిండే సోమవారం ఒక ప్రకటన చేసినా పరిష్కార మార్గానికి పార్టీ వేగవంతంగా చర్యలు తీసుకుంటుందన్న సందేశం పంపేలా చూడాలని పార్టీ నేతలు భావించారు. బంగ్లాదేశ్‌లో రెండు రోజుల పర్యటన నుంచి షిండే తిరిగి వచ్చిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో ఒక స్పష్టత ఏర్పర్చే దిశగా చర్యలను ప్రారంభించాలని కూడా పార్టీ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications