బాబు 'కిరికిరి' మాటలు: అడుగులు లక్ష్యాన్ని దాటినా..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర లక్ష్యాన్ని చేరుకుంది! అక్టోబర్ 2వ తారీఖున జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున పాదయాత్రను ప్రారంభించిన చంద్రబాబు వివిధ ఆరోగ్య, రాజకీయ సమస్యలను దాటుకొని ఈ నెల 26వ తేదిన పాదయాత్ర మొదట నిర్దేషించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. పాదయాత్ర ప్రారంభ సమయంలో జనవరి 26నే ముగించాలని భావించారు.
కానీ ప్రజల నుండి మంచి స్పందన వస్తుండటంతో పాదయాత్రను పొడిగించాలని బాబు నిర్ణయించుకున్నారు. దీంతో మొదట జనవరి 26న ముగించాలని భావించినప్పటికీ దీనిని మరికొంతకాలం కొనసాగించనున్నారు. కాలి నొప్పులు బాగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మూడు రోజుల పాటు బాబు విశ్రాంతి తీసుకొని తన పాదయాత్రను కొనసాగించనున్నారు. వైద్యులు వారం రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పటికీ ఆయన ససేమీరా అన్నారు. చివరకు మూడు రోజులకు ఓకే చెప్పారు.
30వ తారీఖు నుండి బాబు యాత్ర తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాదయాత్ర కొనసాగింపు అంశం ఎలా ఉన్నా బాబు తన నాలుగు నెలల పాదయాత్రను విజయవంతంగా ముగించారు. మొదట అనుకున్నట్లుగా పాదయాత్ర ముగిసినా అది సగం లక్ష్యం చేరుకున్నట్లే! మరో సగం అంటే తదుపరి ఎన్నికలు నిర్ణయించనున్నాయి. బాబు యాత్ర పార్టీని అధికారంలోకి తీసుకు వస్తేనే లక్ష్యం పూర్తిగా నెరవేరినట్లుగా తెలుగు తమ్ముళ్లు భావిస్తారు.

పాదయాత్ర ప్రారంభంలో బాబుతో హరికృష్ణ, నారా లోకేష్. హిందూపురం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

విశ్రాంతి తీసుకునేందుకు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాబు వినియోగిస్తున్న వాహనం.

పాదయాత్రలో డప్పు వాయిస్తున్న బాబు

బాబు నెత్తిన తెలంగాణ బోనం

బాబుకు తెలంగాణలో ఆహ్వానం

తెలుగు తమ్ముళ్లలో బాబు వంద రోజుల యాత్ర పండుగ

వస్తున్నా మీకోసంలో జన సందోహం

బాబు పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన వంద అడుగులు పైలాన్

స్వర్గీయ ఎన్టీఆర్‌కు బాబు నివాళి
బాబు తన నాలుగు నెలల పాదయాత్ర కాలంలో విపక్షాల పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురం నుండి ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాకు చేరుకుంది. ఆయా ప్రాంతాల సమస్యలతో పాటు రాష్ట్ర, దేశ సమస్యలను ఆయన తన యాత్రలో ప్రస్తావించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు అధినాయకత్వం, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఇలా అందరి పైనా ఆయన విరుచుకు పడ్డారు.
లోకేష్ సూచనలతో...
పాదయాత్రలో చంద్రబాబు విమర్శలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆయన కొత్త కొత్త వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులను తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసు అని, కాంగ్రెసు ఐ, కాంగ్రెసు వై అని, తల్లిపాము, పిల్లపాము అని, కిరణ్ కుమార్ రెడ్డిని కిరికిరి రెడ్డి అని ఎద్దేవా చేశారు. జగన్ అవినీతితో డబ్బు సంపాదించాడని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పేందుకు వెయ్యి లారీలలో డబ్బులు అంటూ వివరించే ప్రయత్నాలు చేశారు.
తన తనయుడు నారా లోకేష్ సూచనలతో చంద్రబాబు విపక్షాల పైన కొత్త కొత్త వ్యాఖ్యలతో విరుచుకు పడ్డట్లుగా చెబుతున్నారు. జగన్‌ను కలవాలంటే జైలుకెళ్లి దండం పెట్టుకోవాలని విమర్శించారు. తెలంగాణలో అడుగు పెట్టాక వైయస్ వీసా వ్యాఖ్యల వల్ల సీమాంధ్రలో నష్టపోయామని, తెరాసతో పొత్తు పెట్టుకొని ఇక్కడ నష్టపోయామని చెప్పారు. ఇటీవల విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను తలపించేలా జగన్ పైన బాబు.. విజయమ్మ వాకిట్లో అవినీతి చెట్టు అని విమర్శించారు. తెలంగాణలో కెసిఆర్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో యాత్ర ఉన్న సందర్భంగా గత నెల 28వ తేదిన అఖిల పక్షంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని కెసిఆర్‌కు ధీటైన సమాధానం ఇచ్చారు.












Click it and Unblock the Notifications