'టిమంత్రులు తెలంగాణ ద్రోహులు-ఊరూరా వాల్‌పోస్టర్లు'

కేంద్ర హోంశాఖ తెలంగాణపై ఈ నెల 28వ తేది వరకు గడువు పెట్టుకుందని, గడువులోగా తెలంగాణపై తేల్చలేదు. కాబట్టి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఆ పార్టీ నుండి బయటకు రావాలని వారు డిమాండ్ చేశారు. మంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. బయటకు రాని వారిని తెలంగాణ ద్రోహులుగా గుర్తించి కరపత్రాలు పంచాలని, వాల్ పోస్టర్లు వేయాలని నిర్ణయించారు.
తెలంగాణ కోసం జరుగుతున్న సభలు, సమావేశాల నుండి కాంగ్రెసు పార్టీ నేతలను బహిష్కరించాలని వారు నిర్ణయించారు. కాంగ్రెసు పార్టీ లక్ష్యంగా ఇక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల సమయంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించాలని, తెలంగాణ కోసం జాతీయ రహదారులు నిర్బంధించాలని తెలంగాణ ఐకాస భేటీలో నిర్ణయించింది.
రెండో రోజు సమర దీక్ష
హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద సమర దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. భారీగా తెలంగాణవాదులు తరలి వస్తున్నారు. సమరదీక్షలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ తదితర అన్ని రాజకీయ పార్టీలు పాలుపంచుకున్నాయి. ఇందిరాపార్కు వద్ద సమరదీక్ష నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. మధ్యాహ్నం రెండు గంటలకు తెరాస అధినేత కెసిఆర్ దీక్షలో పాల్గొననున్నారు.
ఆందోళన కలిగించాయి.
కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాదుల ప్రకటనలు తమకు ఆందోళన కలిగించాయని ఎంపి పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమాలు కొనసాగించాల్సిందే అన్నారు. తెలంగాణపై జాప్యం చేస్తే కాంగ్రెసుకు నష్టమే అన్నారు. జానారెడ్డి ఏ సంకేతాలతో సంతృప్తి చెందాడో తనకు అర్థం కావడం లేదన్నారు.












Click it and Unblock the Notifications