వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై ప్రధాని మాట్లాడాలి:రాజ్‌నాథ్, రషీద్ స్పందన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajnath Singh
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణపై నిర్ణీత కాల వ్యవధిలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటన చేయాలని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సోమవారం డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంలో ప్రధాని ఓ కాల వ్యవధిని నిర్దేషించాలని తాము కోరుతున్నామని అన్నారు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎపిలో తెలంగాణ ఉద్యమం మరింత రాజుకుంటున్నందున రాజ్‌నాథ్ స్పందించారు.

తెలంగాణ సున్నిత అంశం

తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ వేరుగా అన్నారు. మళ్లీ సంప్రదింపులు జరపాల్సి ఉందని కేంద్రమంత్రి, ఎపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చెప్పాలన్నారు. తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించాయన్నారు. సిపిఎం ఇంకా నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందన్నారు.

తెరాసను ప్రజలు నమ్మడం లేదు

తెలంగాణ రాష్ట్ర సమితిని, ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, టిటిడిపి ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. కాంగ్రెసు పార్టీ ఎంపీలు చిత్తశుద్ధితోనే తెలంగాణ కోసం పోరాడుతున్నారని అయితే, అంత మాత్రాన లాభం లేదన్నారు. వారు రాజీనామాలు చేస్తే కాంగ్రెసు పార్టీ అధిష్టానం దిగి వస్తుందన్నారు.

తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ఉద్యమిస్తున్నప్పటికీ మంత్రులు, కాంగ్రెసు ఎమ్మెల్యేలకు మాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. సీట్లు, ఓట్ల కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి ఉందని ఆరోపించారు. భవిష్యత్తులో తెలంగాణపై తాము పెద్దన్న పాత్ర పోషిస్తామని ఎర్రబెల్లి చెప్పారు.

English summary
BJP president Rajnath Singh on Monday demanded that 
 
 Prime Minister Manmohan Singh make a statement on the 
 
 Telangana issue and give a timeline. "We want the PM 
 
 to give a statement on the time frame for the 
 
 formation of Telangana state," Singh said. A day 
 
 after the central government indefinitely postponed 
 
 its decision on Telangana issue, the region was on 
 
 the boil Monday as protestors demanding separate 
 
 state took to streets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X