అనుచిత వ్యాఖ్యలు: కెసిఆర్‌పై సీమాంధ్రలో కేసులు

అలాగే, విజయవాడలోని మాచవరం పోలీసు స్టేషన్‌లో మాజీ శానససభ్యుడు అడుసుమిల్లి జయప్రకాష్ కెసిఆర్‌పై ఫిర్యాదు చేశారు. దేశంపై, ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, కెసిఆర్‌పై కేసులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
కెసిఆర్ వ్యాఖ్యలను, క్లిప్పింగులను కెసిఆర్‌పై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ మంత్రులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రధానిపై, దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వారు హైదరాబాదు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేస్తారని అంటున్నారు. కెసిఆర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరనున్నారు.
ఇదిలావుంటే, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, పి. చిదంబరాలపై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు చైతన్యపురి పోలీసులను ఆదేశించింది. తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం ఆ ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరి వ్యవహారంపై దర్యాప్తు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు సోమవారం ఎల్బీ నగర్ పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!