హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కామెంట్లు - కౌంటర్లు: కెసిఆర్ మాట - ఉండవల్లి తూటా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం సమర దీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నుండి మొదలు సోనియా గాంధీ వరకు, ప్రజాస్వామ్యం మొదలు ప్రధానమంత్రి వరకు అందరినీ కెసిఆర్ తూలనాడారు. ఆయన వ్యాఖ్యలపై బుధవారం కాంగ్రెసు పార్టీ నేతలు నిప్పులు చెరిగారు.

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు కూడా మండిపడ్డారు. ఎంపీలు వివేక్, మధుయాష్కీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు కెసిఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ ఏ ఉద్దేశ్యంతో బూతు పదాలు వాడారోనని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు.

కెసిఆర్ పరుషపదజాలాన్ని తెలంగాణవాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలని కాంగ్రెసు నేతలు కోరారు. కెసిఆర్ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటుకు ఆంధ్రా ప్రజల అభిప్రాయం కావాలా? ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను చప్రాసీ అన్న తదితర వ్యాఖ్యల పైన బొత్సతో పాటు ఉండవల్లి ధీటుగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమాన్ని తాము కెసిఆర్ నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదని మధుయాష్కీ కౌంటర్ ఇచ్చారు.

ఇది కెసిఆర్ మాట - అది ఉండవల్లి తూటా

సమర దీక్షలో కెసిఆర్ వ్యాఖ్యలకు ఉండవల్లి అరుణ్ కుమార్, బోత్స సత్యనారాయణలు ధీటుగా స్పందించారు. ఇతర కాంగ్రెసు నేతలు కూడా తీవ్రంగా మండిపడ్డారు.

ఇది కెసిఆర్ మాట - అది ఉండవల్లి తూటా

తెలంగాణకు కాంగ్రెసు మూడు తరాలు మోసం చేశాయని, నాటి తెలంగాణవాదుల ఆత్మహత్యలకు ఇందిరా గాంధీని కెసిఆర్ టార్గెట్ చేశారు. అందరి అభిప్రాయం మేరకే నాటి రాష్ట్రం ఏర్పడిందని, అప్పటి రాష్ట్ర ఏర్పాటు పరిస్థితులు తెలుసుకోవాలని, దేశం కోసం ఇందిర తన ప్రాణాలను అర్పించారని, ఇందిర మృతి అనంతరం ఆమెను విపక్షాలు కూడా విమర్శించలేదని పైగా పొగిడాయని, సోనియా గాంధీ రాజకీయాల్లోకి తనంత తాను రాలేదని, మేమంతా వెళ్లి పిలిస్తే వచ్చారని అలాంటి నెహ్రూ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఉండవల్లి, బొత్స అన్నారు. రాజకీయాలు అంటే కుటుంబంలో గాంధీ కుటుంబం భావించలేదని కెసిఆర్ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. రాజీవ్, ఇందిరలు త్యాగాలు చేశారన్నారు.

ఇది కెసిఆర్ మాట - అది ఉండవల్లి తూటా

తెలంగాణ కోసం తెలంగాణ మంత్రులు, కాంగ్రెసు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. రాజీనామాలు చేస్తే సభల్లో తెలంగాణవాదం ఎవరు వినిపిస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. ఆయనకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కోరాల్సింది రాజీనామాలు కాదని సభల్లో బిల్లు అన్నారు. రాజీనామాలు చేయించి తద్వారా 2014 నాటికి తన బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం తెలంగాణ నేతలు సభల్లో ఉండారనే విపరీత లాజిక్ కెసిఆర్ లాగడమేంటన్నారు.

ఇది కెసిఆర్ మాట - అది ఉండవల్లి తూటా

చప్రాసీకి ఉన్న తెలివి ప్రధానికి లేదని, ఇది ప్రజాస్వామ్య దేశమా? అంటూ కెసిఆర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశం కాబట్టే కెసిఆర్ వాక్స్వాతంత్రంతో ప్రధానిని కూడా చప్రాసీతో పోల్చారని, వేరే దేశంలో అయితే ఎలా ఉండేదో కెసిఆర్‌కు తెలుసునని బొత్స కౌంటర్ ఇచ్చారు. దేశాన్ని అవమానించేలా ఆయన మాట్లాడారని మండిపడ్డారు.

ఇది కెసిఆర్ మాట - అది ఉండవల్లి తూటా

తెలంగాణ కోసం సీమాంధ్రల అభిప్రాయాలు ఎందుకని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష చాలని, నాడు బ్రిటిష్ వారి కోరిక మేరకు దేశానికి స్వాతంత్రం వచ్చిందా అని, సభల్లో తీర్మానం అవసరం లేదని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడాలంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశ ప్రజల అందరి అభిప్రాయాలు అవసరమని, నాడు బ్రిటిష్ పార్లమెంటులో బిల్లు పెట్టడం వల్లనే స్వాతంత్రం వచ్చిందని, సభల్లో తీర్మానం అవసరమని ఉండవల్లి ధీటైన సమాధానం చెప్పారు.

ఇది కెసిఆర్ మాట - అది ఉండవల్లి తూటా

తెలంగాణ వ్యతిరేకులపై మాట్లాడుతూ నాలుకలు చీరేస్తామని, ఖబర్దార్ అని, తెలంగాణ మంత్రులపై మాట్లాడుతూ.. సిగ్గు, శరం ఉండాలని కాంగ్రెసులో ఉండేందుకు అని కెసిఆర్ అన్నారు. కెసిఆర్ రెచ్చగొట్టడం ద్వారా సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని, చంద్రబాబును తిట్టడం ద్వారా ఆ పార్టీ క్యాడర్‌ను తనలో కలుపుకోవాలని, జానాను తిట్టడం ద్వారా తెలంగాణ వాయిస్ అసెంబ్లీలో ఉండకుండా కెసిఆర్ చేస్తూ తెలంగాణకు రాకుండా చేస్తున్నారని ఉండవల్లి అన్నారు. కెసిఆర్ తన ఘాటు వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ప్రజలనే నిండా ముంచుతున్నారని ఆరోపించారు. తెలంగాణ తెస్తాడని కెసిఆర్ పైన ప్రజలు నమ్మకం పెట్టుకుంటే ఆయన వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాడని అభిప్రాయపడ్డారు. కూర్చొని తెలంగాణ సమస్య పరిష్కారం కాకుండా మాట్లాడుతున్నారన్నారు.

English summary
Rajahmundry MP Undavalli Arun Kumar and PCC chief Botsa Satyanarayana lashed out at TRS Chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X