హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీ పార్టీ ఎంత, నీ స్థాయి ఎంత: కెసిఆర్‌పై కిరణ్ ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: కాంగ్రెసు జాతీయ నాయకులపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ మంత్రులతో కలిసి ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుదర్శన్ రెడ్డి, సారయ్య, పొన్నాల లక్ష్మయ్య తదితర తెలంగాణ మంత్రులు ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గన్న, త్యాగాలు చేసిన నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌లను దూషించే నైతిక అర్హత కెసిఆర్‌కు లేదని ఆయన అన్నారు.

మంత్రులను, ప్రజాప్రతినిధులను కెసిఆర్ దూషించడాన్ని కూడా తాను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. కెసిఆర్ వాడిన పదాలు, భాష తెలుగువారంతా సిగ్గుపడి తలవంచుకునే విధంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. "ఇదేనా నీ సంస్కృతి" అని ఆయన అడిగారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన కెసిఆర్‌కు సూచించారు. "నీ పార్టీ ఎంతఠ అని ఆయన అడిగారు. ఒక ప్రాంతంలోని ఒక ప్రదేశానికి పరిమితమైన ఉప ప్రాంతీయ పార్టీ అని ఆయన అన్నారు. దేశానికి దశదిశను నిర్దేశించిన నాయకులను కెసిఆర్ దూషిస్తున్నారని ఆయన అన్నారు. "నీ భాషను, నీ ప్రవర్తనను అసహ్యించుకునే పరిస్థితిని తెస్తున్నావు" అని ఆయన అడిగారు.

కెసిఆర్ దయాదాక్షిణ్యాల మీద తాము ఆధారపడి లేమని ఆయన అన్నారు. మహాకూటమితో కలిసి పోటీ చేసి ఫలితాలు రాకుండానే బిజెపి వైపు వెళ్లిన నీతి కెసిఆర్‌దని ఆయన అన్నారు. ఇక్కడ ఉన్న తెలంగాణ మంత్రులు చాలా మంది తెలంగాణ నినాదం ఉండగానే చాలాసార్లు గెలిచారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ విడిపోవాలా, కలిసి ఉండాలా అనేది చాలాసార్లు వచ్చిందని, కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం జఠిలమైన, సున్నితమైన అంశాన్ని పరిశీలించడానికి మరింత సమయం కావాలని అడిగితే తప్పా అని ఆయన అన్నారు. పెద్ద నాయకులను దూషిస్తే పెద్ద నాయకుడిగా అవుదామనుకుంటే కుదురదని ఆయన అన్నారు.

తెలంగాణ మంత్రులు వారి సొంత బలం మీద గెలిచినవారేనని, కెసిఆర్ దయాదాక్షిణ్యాల మీద గెలవలేదని ఆయన అన్నారు. మహాకూటమిలో ఉండి కెసిఆర్ పది సీట్లు గెలిస్తే, సొంతంగా పోటీ చేసి తెలంగాణలో కాంగ్రెసు 50 సీట్లు గెలిచిందని ఆయన అన్నారు. తమ జాతీయ నాయకులపై, ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కిరణ్ కుమార్ రెడ్డి కెసిఆర్‌ను హెచ్చరించారు. సమస్యను చూపించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదని ఆయన అన్నారు. మన ప్రవర్తన ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలని, పెద్దలను గౌరవించే సంప్రదాయా3న్ని తెలుగువాళ్లంతా గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు.

ఓ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు గానీ మాట్లాడేప్పుడు మర్యాదగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది నీ మీదే పడుతుందని ఆయన కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. "నీ స్థాయి ఎంత, అంత జాతీయ నాయకుడిని దూషించే స్థాయి నీకు ఉందా" అని ఆయన కెసిఆర్‌ను అడిగారు. వయసు వస్తే సరిపోదని, ప్రవర్తన బాగుండాలని ఆయన అన్నారు. కెసిఆర్‌పై పెట్టిన కేసుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని, చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఆయన అన్నారు. ఒక వ్యక్తి వాడే భాష గురించి మాత్రమే తాను మాట్లాడుతున్నానని, ప్రాంతానికి సంబంధించింది కాదని, వేరే వాళ్ల గురించి తాను మాట్లాడడం లేదని ఆయన అన్నారు.

English summary
Lamenting Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao, CM Kiran Kumar Reddy said that the former has no moral status to criticize national leaders like Manmohan singh and Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X