బూతులు మాకొచ్చు, సభ్యతఉంది: కెసిఆర్‌పై రాయపాటి

Rayapati Sambasiva Rao
గుంటూరు: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తున్నారని గుంటూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు వ్యాఖ్యానించారు. కెసిఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను కెసిఆర్ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సభ్యత గల సీమాంధ్రులు అలాంటి మాటలు మాట్లాడబోరని ఆయన అన్నారు.

దౌర్జన్యంతో తెలంగాణ సాధిద్దామనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదని రాయపాటి అన్నారు. కెసిఆర్ ఘోరంగా మాట్లాడుతున్నారని, చెప్పడానికి అలవి గాని భాష మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అది మంచి పద్ధతి కాదని, తెలంగాణ కావాలంటే సామరస్యంగా అడగాలని ఆయన అన్నారు. అధిష్టానాన్ని బూతులు తిడితేనో, చప్రాసీలు అంటేనో తెలంగాణ ఇవ్వరని ఆయన అన్నారు.

నోరుంది కదా అని సభ్యతా సంస్కారాలు వదిలేసి ఎవరిని పడితే వారిని తిడితే తెలంగాణ వస్తుందా, కెసిఆర్ ఎప్పుడైనా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రధాన మంత్రిని కలిశారా? అని అడిగారు. ఫలానా టైంలోపు ఇస్తామని వారు ఆయనకు ఎప్పుడైనా హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. తాము అంతకంటే ఎక్కువే మాట్లాడగలమని, సభ్యత కాదనే ఊరుకుంటున్నామని ఆయన అన్నారు. .

తెలంగాణ కోసం బలిదానం చేసిన వారిలో కెసిఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామని గానీ ఇవ్వమని గానీ చెప్పలేదని, ప్రయత్నం చేస్తామని మాత్రమే కాంగ్రెసు అన్నదని ఆయన చెప్పారు. తెలంగాణ ఇస్తామని కెసిఆర్‌కు ఎవరూ చెప్పలేదని, కెసిఆరే ప్రతిసారీ ఢిల్లీ వెళ్లి వచ్చి తనకు కాంగ్రెసు అధిష్టానం నుంచి సిగ్నల్ వచ్చిందని, సందేశం వచ్చిందనీ చెప్పావారని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+